Allu arjun trivikram srinivas movie son of satyamurthy title tollywood

allu arjun news, allu arjun latest news, allu arjun latest movie, allu arjun latest movie updates, allu arjun trivikram srinivas movie, allu arjun son of satyamurthy, allu arjun s/o satyamurthy, trivikram srinivas s/o satyamurthy, samantha ruthu prabhu news, nitya menon news, adah sharma news

allu arjun trivikram srinivas movie son of satyamurthy title tollywood : According to the telugu film industry.. the latest movie of allu arjun and trivikram combo title is fixed as s/o satyamurthy.

‘సత్యమూర్తి’ ఎవరు..? బన్నీకి ఆ పేరుకి సంబంధం ఏంటి?

Posted: 01/23/2015 10:26 AM IST
Allu arjun trivikram srinivas movie son of satyamurthy title tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్’కి ‘సత్యమూర్తి’ అనే పేరుకి మధ్యగల సంబంధంపై ఇండస్ట్రీలో వర్గాల్లో జోరుగా ప్రచారాలు కొనసాగుతాయి. ఆ పేరుతో బన్నీకి ముడిపెడుతూ వారిమధ్య ‘తండ్రీకొడుకు’ల బంధం వుందుంటూ చెప్పుకుంటున్నారు. బన్నీ ఈజ్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అని అంతా అనుకుంటున్నారు. అసలు ‘సత్యమూర్తి’ ఎవరు..? మొన్నటివరకు వినిపించని ఆ పేరు.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎందుకు మారుమోగిపోతుంది. పైగా.. వారిమధ్య తండ్రీకొడుకుల బంధం ఎలా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!

అసలు విషయం ఏమిటంటే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమధ్య తన చిత్రాలకు కమర్షియల్ టైటిల్స్ కాకుండా వెరైటీగా పెడుతున్నాడు. అందుకు ఉదాహరణగా.. ఆమధ్య పవన్’తో చేసిన చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ అనే సంప్రదాయ టైటిల్ పెట్టి ఫ్యామిలీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాడు. ఇప్పుడు కూడా అలాగే తాను అల్లుఅర్జున్’తో కలిసి తీయబోతున్న తాజా చిత్రానికి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్’ని పెట్టినట్లు సమాచారం! అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇదివరకే ఈ చిత్రానికి టైటిల్’గా ‘త్రిశూలం’, ‘హుషారు’, ‘జాదూగర్’ అనే పేర్లు పరిశీలించినా.. కథకు, బన్నీ పాత్రకు తగ్గట్టుగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్ బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో దాన్నే ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇకపోతే.. ఈ చిత్రంలో బన్నీ వెడ్డింగ్ ప్లానర్’గా నటిస్తుండగా.. అతని సరసన సమంతా, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles