pawan kalyan beard getup creates sensation in industry | tollywood gossips

Pawan kalyan beard new getup controversy news telugu film industry

pawan kalyan, pawan kalyan beard look, pawan kalyan controversy, pawan kalyan updates, pawan kalyan galleries, pawan kalyan news, pawan kayan janasena, pawan kalyan gabbar singh 2, gabbar singh 2 movie, gabbar singh 2 movie updates

pawan kalyan beard new getup controversy news telugu film industry : Recently powerstar pawan kalyan has captured with black beard which creates sensation in telugu film industry. He never look like this before in his career.

పవన్ ‘గడ్డం’ లుక్.. ఇంతలా ఎందుకు పెంచాడో?

Posted: 04/21/2015 10:43 AM IST
Pawan kalyan beard new getup controversy news telugu film industry

మొన్నీమధ్య ఏపీ క్యాపిటల్ కి సంబంధించిన విషయమై రాజధాని ప్రాంత రైతులతో కలిసి మంతనాలు జరిపిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాకంట పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన తాజా సినిమా నేపథ్యంలో బిజీగా వుండవచ్చునని, తన పార్టీని మరింత విస్తృతం చేసుకోవడం కోసమో.. ఇలా రకరకాలుగా పవన్ గురించి వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలెలావున్నా.. సోమవారం శ్రీజ కుటుంబసభ్యులతో ముచ్చటించిన పవన్ కల్యాణ్ సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేశాడు. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్కసారిగా నల్లని నిండు ‘గడ్డం’తో ఆయన ఫోటోలతో దర్శనమిచ్చారు.

కెరీర్ లో ఇంతవరకు ఏనాడూ ఇంత గడ్డంతో కనిపించని.. పవన్ ఇంతలో ఎందుకు పెంచుకున్నాడన్న విషయంపై రకరకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆయన త్వరలోనే నటించే ‘గబ్బర్ సింగ్-2’ సినిమా కోసమే ఇలా గడ్డం పెంచారని, స్టోరీ డిమాండ్ మేరకు అలా పెంచాల్సి వచ్చిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో పవన్ కు సంబంధించి ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వుంటుందని అంటున్నారు. మూవీ కథనం ప్రకారం.. పవన్ పోలీస్ కాకముందు గడ్డం పెంచుకుని ‘పోకిరి’ క్యారెక్టర్ లో కనిపిస్తాడని.. ఆ రోల్ కోసం పవన్ కొత్త లుక్ లో కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో.. ఇలా గడ్డం పెంచాల్సి వచ్చిందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

మరోవైపు.. పవన్ సినిమా కోసం అలా గడ్డం పెంచలేదని, ఆయన షూటింగులు లేని సమయంలో క్యాజువల్ గానే ఇలా వుంటారని కొన్ని సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఇంతలా గడ్డం పెంచుకోవడం ఇది మొదటిసారి కాదని.. ఆయన సాధారణ సమయాల్లో ఇలా గడ్డం పెంచుకోవడమే మామూలేనని.. అయితే గతంలో ఆయన బయటకు రాని పక్షంలో అప్పటి ఫోటోలు లేవని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. పవన్ దర్శనమిచ్చిన ఈ కొత్త అటు అభిమానులను అలరించడంతోపాటు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan beard  telugu film industry  tollywood heroes  

Other Articles