Ram Gopal Varma Creates Sensation By Released His Marriage Invitation Card

Ram gopal varma marriage invitation car 365 days movie audio release function

ram gopal varma news, ram gopal varma updates, ram gopal varma controversy, ram gopal varma gallery, ram gopal varma movies, 365 days movie, 365 days telugu movie, 365 days hot videos, anaika soti hot photos, anaika soti galery

ram gopal varma marriage invitation car 365 days movie audio release function : Ram Gopal Varma has doing 365 days movies promotion in different style. This time Creates Sensation By Released His Marriage Invitation Card for audio release.

ప్రేక్షకులకు విజ్ఞప్తి.. మరో ‘పెళ్లి’కి సిద్ధమైన వర్మ!

Posted: 04/21/2015 11:19 AM IST
Ram gopal varma marriage invitation car 365 days movie audio release function

రాంగోపాల్ వర్మ.. ఏదైనా ఓ వివాదానికి తెరలేపనిదే ఈయన రాత్రిసమయంలో ‘కునుకు’ వేయరేమో! ఓసారి తన ‘పిట్ట’ ద్వారా వివాదాస్పద సందేశాలు తెలిపే ఈయన.. మరోసారి తన సినిమాల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అటు రాజకీయ నాయకుల నుంచి సినీతారల వరకు అందరినీ విమర్శించడం, ప్రశంసించడం ఈయనకు ఈయనే సాటి! పైగా అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలే! ఇలా నిత్యవివాదాస్పదుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తాజాగా అందరికీ దిమ్మతిరిగిపోయేలా తన రెండో ‘పెళ్లి’ ఆహ్వానపత్రికను విడుదల చేశారు. మొదట్లో ‘రాంగోపాల్ వర్మ పెళ్లి పిలుపు’ అంటూ పత్రికను విడుదల చేసిన ఈయన.. తర్వాత అసలు ట్విస్ట్ ఏంటో రివీల్ చేశారు.

ram-marriage-01

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వర్మ చేతిలో ఇబ్బడిముబ్బడిగా ఎన్నో సినిమాలు వున్న విషయం తెలిసిందే! మొన్నటివరకు ఈయన తెరకెక్కిస్తున్న సినిమాలు ఫస్ట్ లుక్స్ వరుసగా విడుదలయ్యాయి కానీ.. ఆ తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి వార్తావిశేషాలు వెలుగులోకి రాలేదు. ఈ కోవలోకే ఈయన రూపొందిస్తున్న ‘365 డేస్’ మూవీ కూడా వుంది! ఈ మూవీకి సంబంధించి ట్రైలర్, వీడియో సాంగ్ టీజర్లు గతంలోనే రిలీజ్ అయ్యాయి కానీ.. ఆ తర్వాత మూవీకి సంబంధించి ఏ వార్త వెలువడలేదు. దీంతో ఈ చిత్రం కూడా మూతపడిపోయిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. వాటిని ఖండిస్తూ తాజాగా వర్మ ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా సరికొత్త విధానాన్ని ఎంచుకుని, ప్రేక్షకుల్ని అబ్బురపరిచారు.

ram-marriage-02

ఈ నేపథ్యంలోనే ఆయన ‘రామ్ గోపాల్‌వర్మ పెళ్లి పిలుపు’ అంటూ వెడ్డింగ్ ఇన్విటేషన్ స్టయిల్‌లో మీడియాకు ఆహ్వానాలు పంపేశారు. అందులో ‘365 డేస్’ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్‌ని తాజ్ డక్కన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు రాసుకొచ్చాడు. అంతేకాదు.. రకరకాల కాన్సెప్ట్ లు అందులో పొందుపరిచారు. తన మూవీలతో ఏదో ఓరకంగా ప్రమోట్ చేయడంలో నిత్యం ముందుండే ఈయన.. ఆ తరహాలోనే ‘365 డేస్’ని వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో సింగర్ గీతామాధురి భర్త నందు- అనైకా సోది జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే విడుదలైన వీడియో సాంగ్స్ లో వీరిమధ్య రొమాన్స్ ని వర్మ బీభత్సంగా చూపించేశారు. మరి సినిమాలో వీళ్లని వర్మ ఏ రేంజ్‌లో చూపిస్తాడోనని మాట్లాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  365 days telugu movie  anaika soti  

Other Articles