fans pleasing pawan kalyan to promote being human charitable trust | salman khan | mahesh babu

Pawan kalyan being human endorsement salman khan mahesh babu

pawan kalyan, pawan kalyan news, pawan kalyan updates, pawan kalyan gossips, pawan kalyan gallery, pawan kalyan gossips, pawan kalyan being human, being human, salman khan news, mahesh babu

pawan kalyan being human endorsement salman khan mahesh babu : fans pleasing pawan kalyan to promote being human charitable trust which is presented by salman khan.

పవన్ కళ్యాణ్ @బీయింగ్ హ్యూమన్‌..?!

Posted: 04/24/2015 12:43 PM IST
Pawan kalyan being human endorsement salman khan mahesh babu

‘బీయింగ్ హ్యూమన్’.. ఆపదలో వున్నవారికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో స్థాపించబడిన ఓ చారిటబుల్ ట్రస్ట్! దీనిని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్థాపించాడు. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ రెండు అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అందులో ఒకటి విద్య కాగా, మరొకటి హెల్త్ కేర్. బాలకార్మికులకు విద్యనందించడం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థను ప్రచారం చేయాలంటూ పవన్ కల్యాణ్ ను ఆయన అభిమానులు కోరుతున్నారు.

ఎందుకంటే.. పవన్ సూపర్ స్టార్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సబులిటీ కలిగిన వ్యక్తి! తన ఆలోచనలు, జీవన విధానం, సేవ కార్యక్రమాలు ఆయన్ను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆయనలో వున్న ఆ మేనరిజమే ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఆయనపట్ల ఓ గౌరవ భావన కలిగేలా చేసింది. ఇక తాజాగా శ్రీజ అనే అమ్మాయికి అందించిన సహాయం ఆయన్నొక మానవరూపంలో వున్న దేవుడిలా అభివర్ణించింది. శ్రీజకు ఈయన అందించిన సహకారం, మనోధైర్యంతో చావు అంచుల నుంచి బయటకు వచ్చింది. ఇటీవలే శ్రీజ తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ ని కలిసింది కూడా!

ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కు సంబంధించి ఓ చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ చారిటబుల్ ట్రస్టును ఇక్కడ కూడా స్థాపించాలని లేదా అలాంటి సంస్థలకు పవన్ కూడా ప్రచారకర్తగా ఉంటే... ఎంతోమంది పిల్లలకు మంచి జీవితం ప్రసాదించిన ఆపన్నహస్తుడిగా ఆయన నిలుస్తారన్న భావనలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ ప్రారంభించిన ‘MARD' (మ్యాన్ ఎగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) కార్యక్రమానికి ప్రచారం చేసి.. తన సోషల్ రెస్పాన్సబులిటీ నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ‘బీయింగ్ హ్యూమన్’ తరుపున ప్రచారం చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

పాపులర్, ప్రభావవంతులైన వ్యక్తుల మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం ఈ రెండు లక్షణాలు కలగలిపిన వ్యక్తి! ఆయన ఏ మంచి పని చేసినా దాని ప్రభావం త్వరగా కనిపిస్తుంది. ఈయన వేసే ప్రతి అడుగు మరో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈయన పలికే వాక్యాలు పదిమందికి సందేశాన్ని అందిస్తాయి. ఈయన నడిచేదారి నలుగురికీ జీవిత గమ్యానికి చేర్చే దిశగా పయనిస్తాయి. అందుకే.. ఈయనలాంటి వ్యక్తి చారిటబుల్ ట్రస్టులను నిర్వహించడమో లేదా వాటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తే.. ఎన్నో జీవితాలు బాగుపడుతాయని ఆశిస్తున్నారు. మరి.. దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  salman khan  being human  mahesh babu  

Other Articles