Lady Director Nandini Reddy Latest Project with Naga Shourya Muhurtham | Tollywood Movies Updates

Naga shourya nandini reddy latest flick muhurtham news malavika nair

Naga Shourya news, Naga Shourya movies, Naga Shourya gallery, Naga Shourya latest updates, Nandini Reddy news, Nandini Reddy movies, Nandini Reddy new project, malavika nair news, malavika nair hot photos, malavika nair Photo shoot

Naga Shourya Nandini Reddy Latest Flick Muhurtham News Malavika Nair : Finally Nandini Reddy latest movie with naga shourya project started. In this movie malavika nair pairing with naga shourya

యువహీరోతో లేడీ డైరెక్టర్ షెడ్యూల్ షురూ

Posted: 04/24/2015 01:35 PM IST
Naga shourya nandini reddy latest flick muhurtham news malavika nair

ఇండియన్ చిత్రపరిశ్రమలో చాలావరకు మగవారిదే హవా ఎక్కువగా కొనసాగుతుంది. చాయ్ అందించేవాడి నుంచి హీరో, డైరెక్టర్ వరకు పురుషుల రాజ్యమే! హీరోయిన్లు సినిమాల్లో కేవలం అందాలు ఆరబోయడానికి తప్ప.. వారి ప్రతిభను గుర్తించే పాత్రలు చాలా అరుదు! ఇటువంటి ఇండస్ట్రీలో మహిళలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వుంటుంది. ఇలా కష్టనష్టాలను ఎదుర్కొంటూ తెలుగు చిత్రపరిశ్రమలో నందినీరెడ్డి డైరెక్టర్ గా ఎదిగింది.

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నందినీ.. ఆ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని తన ప్రతిభను చాటిచెప్పింది. నేటి యువతకు నచ్చేవిధంగా ఆ సినిమాను తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేసింది. ఇలాగే మరిన్ని విజయాలను అందుకుంటూపోతే ఈమె సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుందని అంతా భావించారు కానీ.. ఆమె తెరకెక్కించిన రెండోచిత్రం ‘జబర్దస్త్’ కెరీర్ కి అప్పుడే బ్రేక్ వేసేసింది. మొదటి సినిమాతో ఎన్ని ప్రశంసలు పొందిందో, రెండో సినిమాతో అన్నే విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈమెతో సినిమా చేసేందుకు నిర్మాతలెవ్వరూ ముందుకు రాలేదు. ఇలా ఒక్కసారిగా ఆఫర్లు కరువైన నేపథ్యంలో ఈమె కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే.. ఇప్పుడు నందినీ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించేందుకు రీఎంట్రీ ఇస్తోంది. చాలాకాలం గ్యాప్ తీసుకున్న అనంతరం ఈమె ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తుండగా.. ఇతని సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ఈరోజు(24-04-2015) ఉదయం లాంచనంగా ప్రారంభమైంది. మే 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. షూటింగ్ మొదలుపెట్టాక ఆపకుండా కంటిన్యూ షూటింగ్ తో సినిమాని ఫినిష్ చెయ్యాలని ఈ చిత్ర టీం టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీని ‘అలా మొదలైంది’ ఫేం దాము నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malavika nair  nandini reddy  naga shourya  tollywood updates  

Other Articles