భాక్సాఫీసు వద్ద మన జక్కన రాజమౌళి రూపోందించిన చిత్రం బాహుబలి పాత రికార్డులను తిరగరాసి ముందుకు సాగుతుండగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ చిత్రం కలెక్షన్ల వేటలో బాహుబలి వెంట తోడుగా వెళ్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొంది హిందీ, మళయాళ భాషల్లోనూ అనువాదమై ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన 'బాహుబలి' చిత్రం రెండు వారాలకు 385 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది... త్వరలోనే ఈ చిత్రం 400 కోట్ల క్లబ్ లో చేరబోతోందని 'ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్' లెక్కలు చెబుతోంది...మొదటివారమే 'బాహుబలి' చిత్రం 4580 స్క్రీన్స్ ద్వారా 255 కోట్లు పోగేసింది... ఇది నిజంగా ఓ పెద్ద రికార్డ్. హాలీవుడ్ స్థాయిలో రూపోంది.. రాజముద్ర పడిన చిత్రానికి ఇంతలా కలెక్షన్లను రాబట్టడం బాక్సాఫీసు చరిత్రలోనే ప్రప్రధమం.
'బాహుబలి' రిలీజయిన వారానికి 'బజ్రంగీ భాయిజాన్' చిత్రం 5000 స్క్రీన్స్ లో విడుదలయింది... ఈ సినిమా మొదటి వారం 184 కోట్ల 62 లక్షలు పోగేసి 'పీకే', 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాల రికార్డులను బీట్ చేసింది... అయితే 'బాహుబలి' చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు మాత్రం అధిగమించలేకపోయింది. అయితే బాహుబలి చిత్ర కలెక్షన్ల రికార్డులను వసూలు చేయడంతో.. దానిని బాలీవుడ్ మేధావులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాహుబలి రికార్డులన్నీ ఒట్టిమాటగా కోట్టిపారేస్తూ.. ఈ లెక్షన్ల రికార్డులు వట్టివేనంటూ కామెంట్లు చేసి తమ అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. బాలీవుడ్ లో దక్షిణాది ఆధిపత్యాన్ని సహించలేని వారు అనేక మందే వున్నారు. బాహుబలి రికార్డులను పక్కనబెట్టి, చిత్రం రూపొందిన సినిమారాజును ప్రశంసించడానికి బదులు ఇలా కామెంట్లు చేసి తమ అధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more