allu arjun visits charminar in masked man getup

Bunny turns masked man

bunny turns masked man, allu arjun visits charminar in masked man getup, bunny, allu arjun, charminar, masked man, tollywood news, masked man, bunny wife sneha reddy, bunny selfie, allu arjun selfie, allu arjun movies, allu arjun latest news, allu arjun new movies, allu arjun hits, allu arjun collections

tollywood stylish star allu arjun alias bunny visits charminar with wife and friends in masked man getup

ముసుగు వీరుడిగా మారిన బన్ని..? ఎందుకు..?

Posted: 07/26/2015 07:56 PM IST
Bunny turns masked man

సెలబ్రిటీలు.. కానీ తాము కూడా మానవులమేనని, తమలో వున్న చిన్న, చిన్న కోరికలను సరదాలను తీర్చుకోవాలని ఆశపడుతుంటారు. అయితే ప్రజల్లో తమకున్న క్రేజ్ కారణంగా.. అవి తీర్చుకోవడం సాధ్యం కాక.. చేతులెత్తేస్తుంటారు. అయితే కొందరు మాత్రం తమ సరదాలను తీర్చుకుంటారు. అయితే అందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిలో మారు వేషాలు, ముసుగు వీరులు, ఇలా అనేక ముందస్తు చర్యలను తీసుకుని సరదాలను తీర్చుకుంటారు. ఈ మధ్య పెను సంచలనంగా మారిన సెల్పీలను కూడా తీసుకుని.. వాటిని కొన్నాళ్ల తరువాత చూసుకుని ఆ సరదాల కోసం ఎంత శ్రమించామన్నది గుర్తు చేసుకుని గడుపుతుంటారు. ఆ మధ్య రజనీకాంత్ మారు వేషంలో నాంపల్లిలో ఆటోలో తిరిగారని టాక్. అయితే ఈ మధ్యకాలంలో ఆలా చేసిన సెలబ్రిటీ ఎవరంటారా..?

టాలీవుడ్ లో తిరుగులేని స్టైలిష్ స్టార్ గా, అభిమానుల మదిలో బన్నిగా ముద్రవేసుకున్న అల్లు అర్జున్. నమ్మశక్యంగా లేదా..? నిజమండీ  ఆయన తన స్నేహితులతో కలసి చార్మినార్ అందాలను రాత్రి సమయంలో వీక్షించాలని అనుకున్నారు. అంతే అక్కడికి వెళ్లారు. కానీ తనను ఎవరైనా గుర్తిస్తే.. అసలే ఇరుకైన రోడ్లపైన నిత్యం రద్దీగా వుండే ట్రాఫిక్ లో అలా.. అలా నడుచుకుంటూ వస్తే.. ఇక ట్రాఫిక్ జామ్ అవ్వడం ఖాయం. అభిమానులు పోటేత్తి సెల్పీలు, అటోగ్రాఫ్ లు ఇలా ఒక్కటి కాదు నానా హంగామా చోటుచేసుకోవడం తప్పదు. వీటన్నింటినుంచి తప్పించుకుని బన్నీ చార్మినార్ ను తన స్నేహితులతో కలసి సెల్పీలు తీసుకున్నారు. అదెలా అంటారా..? అందాల స్టైలిష్ స్టార్.. ఏకంగా ముసుగువీరుడిగా మారాడు. తలపైన టోపీ.. ముఖానికి కర్చీఫ్ కట్టాడు. టోటల్ గా లుక్ మార్చుకొని చార్మినాలో చక్కర్లు కొట్టాడు. మరో విషయమేమిటంటే.. బన్నితో పాటుగా ఆయన సతీమణి కూడా ఈ సిటీ టూర్ లో వున్నారు. తన భార్య, ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫీ దిగాడు. ఇలా మొత్తానికి బన్ని చార్మినార్ పర్యటన సాగింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bunny  allu arjun  charminar  masked man  selfie  tollywood news  

Other Articles