కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’. డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లో 23 ఏళ్ళ కిత్రం మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిల్వర్ జూబ్లీ మూవీ ‘అల్లరిమొగుడు’ చిత్రం తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ ను క్రియేట్ చేయడానికి రెడీ అయింది. అంతే కాకుండా ఈ జనరేషన్ కామెడి స్టార్ అల్లరి నరేష్ నటించిన 50వ చిత్రం కూడా ఇదే. నరేష్ సరసన పూర్ణ హీరోయిన్ గా నటిస్తుంది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. పాటలకు శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. మోహన్ బాబు, అల్లరి నరేష్ వంటి డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నరు. క్రేజీ కాంబినేషన్ లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు :
డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను
టెక్నిషియన్స్ :
మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, కోటి, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more