టైటిల్ లో ఏ మాత్రం ప్రాస తగ్గలేదు కదా? అచ్చం ఇలాగే, ఆడియన్స్ లో ఎంతమాత్రం ఆత్రుత తగ్గడం లేదు. సంక్రాంతి 2016 సినిమాల తో సంబరాన్ని మాత్రమే కాదు, కాస్త కోల్డ్ వార్ ని కూడా మూట గట్టి తీసుకోస్తోందా?
ఒకరికి శత చిత్ర మైలు రాయి చేరుకోడానికి ఈ సినిమా మెట్టు... మరొకరికి 25 వ మైలు రాయి ఈ సినిమా... ఇద్దరికీ ఇవి చాలా ముఖ్యమైన సినిమాలు... వీరి అభిమానులకు కూడా అంతేగా మరి... అయితే, వీరిద్దరూ ఒకే వంశానికి చెందిన వారు... నవరస సర్ర్వభౌముడు పుట్టిన వంశం అది... ఒకరు వీరి అబ్బాయి అయితే, మరొకరు మనవడు... వీరిద్దరూ ఒకరికొకరు బాబాయి, అబ్బాయి... సంక్రాంతిని వేదికగా చేసుకుని, తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు వీరిద్దరూ. మరి ఈ బాబాయి - అబ్బాయి సినిమాలని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? నందమూరి అభిమానులు ఎలా ఆరాధిస్తారు? సంక్రాంతే చెప్పాలి.
యంగ్ టైగర్ యన్. టీ. ఆర్., ప్రయోగాలకు మారుపెరైన సుకుమార్ తో కలిసి చేసిన స్టయిలిష్ అటెంప్ట్ "నాన్నకు ప్రేమతో"... సరికొత్త క్లాసీ లుక్ తో, ఐ.ఓ. వాక్ బోర్డ్ మీద హీరోయిన్ ని ఫాలో అవుతూ కనపడతాడు, ఈ సినిమాలో యన్. టీ. ఆర్. ఈ సినిమాకు సంబంధించి ప్రతీ అప్డేట్, మనకి సినిమా చూడాలి అన్న ఆసక్తిని పెంచుతూనే ఉంది. ముందు, సంక్రాంతి బరిలో ఉండనన్న "నాన్నకు ప్రేమతో", అభిమానులను ఇంకా వెయిట్ చేయించడం ఇష్టం లేక, సంక్రాంతికే ఒచ్చేస్తున్నాడు. యంగ్ టైగర్ 25వ సినిమా కావడం వల్ల కూడా, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
"డిక్టేటర్" గా బాలయ్య, సంక్రాంతికి రావాలని, ముందు నుంచీ ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అనుకున్నట్టే, సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. ఏ మాత్రం క్రేజ్ తగ్గని బాలయ్యకు, 99 వ చిత్రం ఇది. శ్రీవాస్ దర్శకుడు కావడంతో, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, తన టచ్ కూడా యాడ్ చేసి, "డిక్టేటర్" గా బాలయ్యను సంక్రాంతి రేస్ లో నిలబెట్టాడు...
అవును... పోటీ ఏ... కానీ, ఆశయం మాత్రం ఒక్కటే, ప్రేక్షకులని అలరించాలని... అందుకే, పోటీ ఉన్నా... నందమూరి బాబాయి - అబ్బాయి మధ్య ఈ పోటీ ఆరోగ్యవంతమైన పోటీ... "నాన్నకు ప్రేమతో", "డిక్టేటర్" కు సమానంగా ఆనందం రావాలని, సంక్రాంతి సాక్షిగా కోరుకుందాం మనం!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more