చెప్పను బ్రదర్ జోకులు విన్నారా..? | Cheppanu Brother jockes in Social Media

Cheppanu brother jockes in social media

Cheppanu Brother, Allu Arjun, Alli Arjun comments, Cheppanu Brother comment, Cheppanu Brother jockes, చెప్పను బ్రదర్, అల్లు అర్జున్

Alu Arjun latest comments about Pawan Kalyan going viral in social Media. Some people creating Cheppanu Brother jockes.

చెప్పను బ్రదర్ జోకులు విన్నారా..?

Posted: 05/18/2016 10:19 AM IST
Cheppanu brother jockes in social media

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. సరైనోడు సక్సెస మీట్, విజయోత్సవ సభల్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ల మీద పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చెప్పిన చెప్పను బ్రదర్ అన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టాప్ ట్రెండింగ్ కీ వర్డ్స్ లో ఆ వర్డ్ కూడా ఉండటం విశేషం.

అల్లు వారి గిల్లుడు అని, అల్లు వారి కామెడీ అంటూ ఇంటర్నెట్ లో పేలుతున్న ఆ జోకులు మీరు కూడా చూడండి మరి.
24 సినిమాలో నా వాచ్ ఎక్కడరా...? అని ఆత్రేయ అడిగే డైలాగ్ కు అల్లు అర్జున్ స్టైల్లో సమాధానమిస్తున్నారు కొంత మంది నెటిజన్లు. నా వాచ్ ఎక్కడరా...? అని అడిగితే చెప్పను బ్రదర్ అని సమాధానమిస్తున్నారట.
బాహుబలిలో.. నేను ఎన్నడూ చూడని కళ్లు నన్ను దేవుడిగా చూస్తున్నాయి .. నేనెవర్నీ.? అని ఎంతో ఎమోషనల్ డైలాగ్ ను అల్లు స్టైల్లోకి అనువదించారు. నేను ఎన్నడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి.. నేనెవర్నీ.? అని అడిగితే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని సమాధానమిస్తారట.
టెంపర్ లోని డైలాగును కూడా ఇలానే వాడేసుకుంటున్నారు. నీ చుట్టూ వైఫై ఉంటుందా.. మరి పాస్ వర్డ్ ఏంటి అని ప్రకాశ్ రాజ్ అడిగితే చెప్పను బ్రదర్ అని సమాధానమిస్తాడట.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మోస్ట్ సెంటిమెంటల్ డైలాగ్ రేయ్ పుల కుండిని ఎందుకురా తన్నావ..? అని అడిగితే దానికి చిన్నోడు అల్లు చెప్పను బ్రదర్ అని సమాధానమిచ్చాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles