అనుష్కలో ఆ కోణం చూసిన దర్శకేంద్రుడు | Raghavendra rao impressed with Anushka

Raghavendra rao impressed with anushka

Raghavendra rao aout Anushka, Anushka role in Om Namo Venkatesha, Nagarjuna in Om Namo Venkatesha

Raghavendra rao impressed with Anushka sanyasin role in Om Namo Venkatesha.

అనుష్కలో ఆ కోణం చూసిన దర్శకేంద్రుడు

Posted: 07/06/2016 10:42 AM IST
Raghavendra rao impressed with anushka

ఇప్పుడున్న నటీమణుల్లో చాలా మంది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరక్షన్లో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. దానికి కారణం హీరోయిన్లను ఎలా వాడుకోవాలో ఆయనకు కరెక్ట్ గా తెలుసనే నమ్మకం. అంతేకాదు ఆయన చేతిలో పడితే ఎక్కడికో వెళ్లిపోతామనే ఆశ కూడా. అలాంటి వెయిటింగ్ లిస్ట్ చాలానే ఉంది. కానీ, వెరైటీగా రాఘవేంద్ర రావు ఓ హీరోయిన్ కోసం చాలా ఎదురు చూశారంటే ఆశ్చర్యపోవాల్సిందే

ఇంతకీ ఆమె ఎవరో కాదు. లేడీ స్టార్ అనుష్క గురించి.. ఈ విషయం గురించి ఆయన తన ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు. "ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా చేయగల ఆర్టిస్టులలో అనుష్క ఒకరు. బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వుంది. తనకి నా సినిమాలో తగిన క్యారెక్టర్ వస్తే పనిచేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' సినిమాతో ఆ కోరిక తీరింది అంటున్నాడు.

అంతేకాదు కెరీర్లో మొదటిసారిగా ఆమె ఓ భక్తురాలిగా, సన్యాసి పాత్రలో ఇందులో నటించబోతుందట. ఆ పాత్రలో ఆమె నటన చూస్తుంటే చాలా ఆనందంగా వుందంటూ ఆయన చెప్పుకోచ్చాడు. అన్నట్లు నాగార్జునకి జోడీగా కనిపించడం లేదన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించాడు. ఏదేమైనా రాఘవేంద్రరావు స్టార్ దర్శకుడు నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న అనుష్క నిజంగా అదృష్టవంతురాలే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles