టాలెంటెడ్ హీరో సూర్యకి తెగ బోర్ కొడుతుందట. 24 లాంటి టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఉన్న ఢిపరెంట్ సినిమాతో వచ్చినప్పటికీ జనాలు పెద్దగా ఎక్కించుకోలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు హిట్ చేసినప్పటికీ కోలీవుడ్ జనాలకు అది ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. దీంతో క్లాస్ వేషాలేవి తనకు అచ్చి రావటం లేదన్న అభిప్రాయానికి వచ్చాడీ కోలీవుడ్ స్టార్ హీరో.
ప్రస్తుతం సింగం-3 షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య తన తర్వాతి చిత్రం కోసం కబాలి దర్శకుడు రంజిత్ ను లైన్ లో పెట్టాడు. ఈ విషయాన్నిరంజిత్ కూడా దృవీకరించాడు. అయితే ఈ లోగా మరో డైరక్టర్ కూడా సూర్యకి స్టోరీ వినిపించడం, ఆయన ఓకే చేయటం జరిగిందని తెలుస్తోంది. విశాల్ లేటెస్ట్ చిత్రం రాయుడు తో తెలుగు వారికి చేరువయ్యాడు దర్శకుడు ముత్తయ్య. ఆయన దర్శకత్వంలోనే సూర్య సినిమా చేయబోతున్నాడని సమాచారం.
తమిళంలో గ్రామీణ నేపథ్యంలో గల కథలను తెరకెక్కించే దర్శకుడిగా ముత్తయ్యకి మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు గతంలో కార్తీతో కొంబన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు కూడా. ఇక ఇప్పుడు తన గత చిత్రాల మాదిరిగానే, ఈసారి సూర్యతోను ఆయన గ్రామీణ నేపథ్యంలో ఒక సినిమా చేయనున్నాడట. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సూర్య పక్కా విలేజ్ యువకుడిగా అలరించబోతున్నాడంట. ఇక నటుడు రాజ్ కిరణ్(పందెం కోడి ఫేం) సూర్యకి తండ్రి పాత్రలో నటించబోతున్నాడని తెలస్తోంది. అయితే ఈ సినిమా సింగం-3 తర్వాతనా లేక రంజిత్ సినిమా తర్వాతనా అన్నది తేలాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more