పంది కోసం మళ్లీ అదే పని! | Adhugo title fix for Ravi babu piglet movie

Adhugo title fix for ravi babu piglet movie

Ravi babu piglet movie title, Adhugo telugu movie, ravi babu adhugo movie

Adhugo title fix for Ravi babu piglet movie.

పంది కోసం కూడా అదే పని!

Posted: 07/12/2016 06:20 PM IST
Adhugo title fix for ravi babu piglet movie

విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించి నటుడిగానే కాదు, అంతకు మించి విచిత్రమైన కాన్సెప్ట్ లతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా రవిబాబుకి తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రవిబాబు, ఈసారి ఒక ప్రయోగానికి సిద్ధపడ్డాడు.

కాస్ట్ లీ పందిపిల్ల నేపథ్యంతో ముడిపడిన ఒక కథను సైలెంట్ గా సినిమాగా ఆయన తెరకెక్కించాడు. ఇందుకోసం ఆయన ఖరీదైన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం విశేషం. ఈ సినిమాలో కొత్తవారైన అభిషేక్ - నాభ ప్రధాన పాత్రలను పోషించారు.

ఇక తాను దర్శకత్వం వహించే సినిమాలకి 'అ' అనే అక్షరంతో టైటిల్ మొదలయ్యేలా చూసుకోవడం ఆయన సెంటిమెంట్. అల్లరి .. అనసూయ .. అవును చిత్రాలు అలా వచ్చినవే. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో కొత్త చిత్రానికి కూడా పాటించాడు. చిత్రానికి 'అదుగో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi babu  piglet movie  Adhugo  

Other Articles