teja rana title fixed as charitra

Teja rana title fixed as charitra

teja rana movie title fixed, charitra for rana and teja, political backdrop charithra for rana

teja rana movie title fixed as charitra complete political backdrop.

రానాతో చరిత్ర సృష్టించబోతున్నాడా?

Posted: 07/13/2016 09:40 AM IST
Teja rana title fixed as charitra

మాములు ప్రేమకథలను చాలా ఢిపరెంట్ కాన్సెప్ట్ లతో తీస్తుంటాడు దర్శకుడు తేజ. అయితే ఒకప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ అయిన ప్రేక్షకులకు రాను రాను ఆ ఫార్ములా చాలా బోర్ కొట్టేసింది. దీంతో ఎప్పటికప్పుడు పంథాలు మారుస్తున్నానంటూ టార్చర్ సబ్జెక్టులతో సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో హ్యాండ్సమ్ హంక్ రానాతో సినిమా అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.

పైగా కాజల్ అగర్వాల్, కేథరిన్ లాంటి హీరోయిన్లతో తీసుకోవటంతో చిత్రంపై ఆసక్తి నెలకొనేలా చేస్తోంది. ఇక ఈ చిత్రం రానా గతంలో వచ్చిన లీడర్ లాగే రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందట. అదే టైంలో వినోదాత్మక ప్రేమకథగా తేజ దీనిని తెరకెక్కించనున్నాడని సమాచారం.

ఈ చిత్రానికి చరిత్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తీయబోయే ఈ చిత్రం కోసం ప్రస్తుతం సెట్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారంట. సెప్టెంబర్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teja  Rana  charitra  kajal  catherine  

Other Articles