బ్రహోత్సవం దెబ్బ బాగానే పని చేసింది | srikanth addala low budget movie with dil raju

Srikanth addala low budget movie with dil raju

Srikanth Addala next, Srikanth Addala low budget movie, Srikanth Addala again under Dil Raju

Director Srikanth Addala low budget movie under Dil Raju banner.

బ్రహ్మోత్సవం దెబ్బ బాగానే పని చేసింది

Posted: 07/13/2016 11:20 AM IST
Srikanth addala low budget movie with dil raju

చిత్రపరిశ్రమలో ఎన్ని వరుస హిట్లు ఉన్నా సరే ఒక్క భారీ ఫ్లాప్ పలకరిస్తే చాలూ అవకాశాలు అస్సలు పలకరించవు. అందుకే పాత చింతకాయ పచ్చడి కథలకు ఎంటర్ టైన్ మెంట్ కలర్ అద్ది అవే సినిమాలను రిపీట్ చేస్తుంటారు. సినిమా యావరేజ్ ఆడినా సరే సక్సెస్ అయినట్లే అని హ్యాపీగా ఫీలవుతుంటారు. అంత చేసినా అప్పుడప్పుడు పరాజయాలు పలకరించడం మామూలే.

అలాంటి వారిలో ఒకడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం తర్వాత సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్లు అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆపై వరుణ్ తేజ్ ముకుందాతో కాస్త తగ్గగా, 'బ్రహ్మోత్సవం'తో భారీ గానే పరాజయాన్ని అందుకున్నాడు. మాములు కథలను లోకల్ లోకేషన్లలోనే తీసినప్పటికీ, భారీ బడ్జెట్ ఖర్చవుతుండటం, బ్యాక్ టూ బ్యాక్ ఆ రెండూ బొక్కా బోర్లాపడటంతో నిర్మాతలు ఆయన ముఖమే చూసేందుకు భయపడుతున్నారు.

అయినా సరే శ్రీకాంత్ తో సినిమా చేయడానికి నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక చిన్న సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈసారి శ్రీకాంత్ అడ్డాల ఒక సింపుల్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడట. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను ప్లాన్ చేశారని అంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్ 'కొత్త బంగారు లోకం'తో హిట్ కొట్టింది. అయితే సీతమ్మ వాకిట్లో హిట్ అయినా స్టార్ క్రూ భారీ రెమ్యునరేషన్ తో రాజుగారికి పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో ఎలాగైనా చిన్న సినిమాతో ఇప్పుడు కాసులు రాల్చుకోవాలని చూస్తున్నాడు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikanth Addala  Brahmotsavam  low budget movie  Dil Raju  

Other Articles