దగ్గుబాటి మల్టీస్టారర్ నిజం కాదా? | venky rana multi starrer with kshanam director

Venky rana multi starrer with kshanam director

venky rana multi starrer, kshanam director Ravikanth Perepu, kshanam director for daggubati multi starrer

venky rana multi starrer with kshanam director Ravikanth Perepu.

దగ్గుబాటి మల్టీస్టారర్ నిజం కాదా?

Posted: 07/13/2016 01:25 PM IST
Venky rana multi starrer with kshanam director

వెంకటేశ్ .. రానా కాంబినేషన్లో  మనం తరహాలో దగ్గుబాటి ప్యామిలీ నుంచి మల్టీ స్టారర్ రానున్నట్టుగా కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. అయితే అది గాసిప్ అని... ఎవరో లేపిన రూమర్ అని దగ్గుబాటి ఫ్యామిలీనే తేల్చింది. ఆ తరువాత ఇలాంటి వార్త ఎప్పుడూ రాలేదు. అసలు వారికి ఆ ఆలోచన లేదనే అంతా అనుకున్నారు.

 కానీ, ఈ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ కోసం ఒక కథ రెడీగా ఉందట. ఇప్పటికే ఫైనల్ వెర్షన్ వెంకటేశ్ .. రానా లతో పాటు సురేశ్ బాబుకి కూడా బాగా నచ్చిందట. దాంతో అంతా ఓకే చెప్పేశారని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమాకు దర్శకత్వం ఎవరో తెలుసా? 'క్షణం' సినిమాతో హిట్ కొట్టిన రవికాంత్ పేరెపు.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మించబడనుందట. 'బాహుబలి 2' రానా షూటింగ్ పార్ట్  ముగిసిన వెంటనే, ఇంకోవైపు సాలా ఖద్దూస్ రీమేక్ మధ్యలో ఉండగానే వెంకీ ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati multistarrer  venkatesh  Rana  kshanam director  Ravikanth Perepu  

Other Articles