వరుసగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు | mega heroes movies back to back in 2017

Mega heroes movies back to back in 2017

mega hero movies, mega hero movies 2017, mega hero movies back to back, mega hero movies planning, mega hero movies competitiom, 2017 mega hero movies, Mega Nama Samvastharam, mega hero festival, mega movie festival 2017, Mega Heroes

mega heroes movies back to back release in 2017.

గెట్ రెడీ ఫర్ మెగా ఫెస్టివల్

Posted: 09/01/2016 11:29 AM IST
Mega heroes movies back to back in 2017

టాలీవుడ్ లో మెగా అన్న ట్యాగ్ లైన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరు లేపిన పునాదుల మీద పుట్టగొడుగుల్లా నట వారసులు వస్తున్నప్పటికీ, వారంతా వరుసగా సక్సెస్ లు కొడుతూ దూసుకుపోతున్నారు అయితే త్వరలో ఈ మెగా హీరోలంతా వరుస బెట్టి సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

మెగా అభిమానంకు మించింది లేదు..

డిసెంబర్ లో మొదలయ్యే ఈ మెగా ఫెస్టివల్ వరుసగా ఆరేడు నెలలపాటు వరుసగా సాగనుంది. ముందుగా మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ మిస్టర్ గా ఈ డిసెంబర్ లోనే రానున్నాడు. శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక జనవరిలో అయితే మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగే. ఎందుకంటే చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సంక్రాంతికే రాబోయేది. సో... జనవరి లో ఆ సందడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాతి నెలే చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సైన్స్ ఫిక్సన్ విడుదల చేయాలని చూస్తున్నారు. అక్టోబర్లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాను మూడు నెలలో ముగించి టైంకి రిలీజ్ చేయాలని సుక్కూ భావిస్తున్నాడు..

పవన్ జన్మదిన సందర్భంగా అదిరిపోయిన మెగాహీరోలు..

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో తీయబోయే సినిమాకు మార్చి ముహుర్తం కుదిరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యం కావటం, పైగా రాజకీయ షెడ్యూల్ తో బిజీ కావటంతో సెప్టెంబర్ నుంచైనా నిదానంగానైనా పూర్తి చేసి మార్చ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ తర్వాత వరుసలో ఉంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ ఇప్పటికే లాంచనంగా ప్రారంభం కాగా, ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్ సెంటిమెంట్ కారణంగా ఆలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.  

 ధ్రువ డేట్ లాక్ చేసుకోండి

 

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గోపీచంద్ మలినేని తో తీయబోయే చిత్రం షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మే నెలలో ఆడియన్స్ ముందు తీసుకురావాలని చూస్తున్నాడు. మరో హీరో అల్లు శిరీష్ శ్రీరస్తు ఇచ్చిన తొలి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ లు వింటున్న ఈ అల్లు వారబ్బాయి జూన్ లోగానీ, జూలైలో గానీ తన తదుపరి చిత్రంతో సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇలా మెగా హీరోలంతా వరుసగా అభిమానులను అలరించనున్నారు. మాములుగా మెగా హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయంటే అభిమానులకి కలిగే ఆనందమే వేరు. అలాంటిది రానన్నది మెగా నామ సంవత్సరమంటే ఇక ఆ సంతోషం అంతా ఇంతా కాదు.

 ధ్రువలో అంత స్కోప్ ఎక్కడిది...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Heroes  movies  back to back  2017  

Other Articles