ఇంకొక్కడు కలెక్షన్లు పెరిగిపోతున్నాయి | inkokkadu collections increased in telugu

Inkokkadu collections increased in telugu

inkokkadu collections increased, inkokkadu collections, Vikram Inkokkadu safezone, Inkokkadu stable collections

Even though negative talk inkokkadu collections increased.

నెగటివ్ టాక్ అయినా షాక్

Posted: 09/10/2016 05:35 PM IST
Inkokkadu collections increased in telugu

తన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ లు కాకపోయినప్పటికీ, ప్రయోగాలకు ఏ మాత్రం వెనకాడడు విక్రమ్. విభిన్నమైన గెటప్స్ తో కనిపించడానికి ఆసక్తిని చూపిస్తుంటాడు. అందువల్లనే కథా, కథనాల సంగతి ఎలా వున్నా ఆయన పాత్రల్లోని కొత్తదనాన్ని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి వెళుతుంటారు. ఒకటి పోయినా తర్వాతి దానిపై అంచనాలు ఏ మాత్రం తగ్గవు.

సరిగ్గా విక్రమ్ ఇంకొక్కడు విషయంలో ఇదే జరుగుతోంది. అపరిచితుడు తర్వాత ఐ సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. కానీ, ఓవరాల్ గా తమిళ్ లో యావరేజ్ గా నడిచినా, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయ్యింది. మధ్యలో 10 ఎంద్రాకుల్ల చిత్తుగా ఫ్లాప్ కావటంతో తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు ఇంకొక్కడు మాత్రం రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. ట్విస్ట్ లు, మంచి కథే అయినప్పటికీ కథనం నిదానించడం, లాజిక్ లు లేకపోవటంతో ఇక్కడ అక్కడా సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల పై మాత్రం అస్సలు చూపడటం లేదు.  

కోలీవుడ్ లో ఈ వారం సరైన సినిమాలు లేకపోవటం అక్కడ ఫ్లస్ అయితే, తెలుగులో మాత్రం విక్రమ్ కారణంగానే జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. హీరోగా, విలన్ గాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తొలి రోజున 5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'జ్యో అచ్యుతానంద' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, రెండోరోజు కూడా అదే స్థాయిలో ఇంకొక్కడు వసూళ్లు తేవటం విశేషం. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇక సినిమా తెలుగు హక్కులను 11 కోట్లకు కొనుగోలు చేయటంతో ఆ లెక్కన దాదాపు నిర్మాత కృష్ణారెడ్డి సేఫ్ జోన్ కి చేరినట్లే చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  Inkokkadu  Collections  

Other Articles