తొమ్మిది రోజుల జనతా గ్యారేజ్ కలెక్షన్లు | janatha garage collection study on 9th day

Janatha garage collection study on 9th day

Janatha Garage nine days collection, Janatha Garage telugu states collections, Janatha Garage 9days collections, Janatha Garage nizam record, Janatha Garage records, Janatha garage new scenes

Janatha Garage collection study on 9th day, Jyo Achyutananda not effect on NTR movie.

గ్యారేజ్ ప్రభంజనం ఎందుకు తగ్గట్లేదు?

Posted: 09/10/2016 05:43 PM IST
Janatha garage collection study on 9th day

రోజులు గడుస్తున్నా, పోటీగా మంచి చిత్రాలు ఉన్నా జనతా గ్యారేజ్ ప్రభంజనం ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తారక్ సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తే ఎవరికైనా కళ్లు తిరగటం ఖాయం. ఓవైపు ఓవర్సీస్ తోపాటు దుమ్మురేపేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ చిత్రాల జాబితాలో సెకండ్ ఫ్లేస్ లో నిలిచిన జనతా గ్యారేజ్ పోటీగా ఉన్న చిత్రాలతో పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదని తెలుస్తోంది. దీనికి తోడు అదనంగా సీన్లు జత చేయటంతో క్రౌడ్ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇక టాక్ కు.. రివ్యూలకు అతీతంగా విజయాన్ని అందుకున్న చిత్రం జనతా గ్యారేజ్.ఈ సినిమా జూనియర్ ఎన్టిఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోనుంది. అటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తూఫాన్ సృష్టిస్తోంది. వాస్తవానికి జనతా గ్యారేజ్ మూవీలో కాసిన్ని లోటుపాట్లున్నా... కేస్టింగ్‌తో పాటు సినిమాలో ఉన్న భారీతనం.. ఎన్టీఆర్ యాక్టింగ్.. కొరటాల టేకింగ్.. ఆ లోపాలను ఓవర్ కమ్ చేసేశాయి. చాలా నెలల తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీరేలా చేసిన సినిమా జనతా గ్యారేజ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా గ్యారేజ్ కలెక్షన్ల సునామీ ఇలా ఉంది...

నైజాం      - 15 .23 కోట్లు
సీడెడ్       - 8. 88 కోట్లు
వైజాగ్        - 5 . 74 కోట్లు
ఈస్ట్           - 4 కోట్లు
వెస్ట్            - 3 .44 కోట్లు
కృష్ణా            - 3 . 60 కోట్లు
గుంటూరు     - 4 . 82 కోట్లు
నెల్లూరు        - 1 . 76 కోట్లు
మొత్తం -  47 . 47 కోట్లు

టోట‌ల్‌గా 9 రోజుల‌కు గ్యారేజ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ 65.50 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈరోజు నుంచి మళ్ళీ మూడు రోజులు సెలవు రోజులు కావడం సినిమాకు ప్ల‌స్ కానుంది. ఈ వీకెండ్ లో 5-6 కోట్లు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది.ఈ వీకెండ్ లో వసూళ్ళు అంతంతమాత్రంగా ఉంటే మాత్రం,మొత్తం వసూళ్ళు 70 -72 కోట్లకు కొంచెం అటూ ఇటూగా ఉండే ఛాన్సులు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Nine Days Collections  

Other Articles