ఏం సెటిల్ మెంట్ కోసం జక్కన్న సర్కార్ ను కలిశాడబ్బా? | Baahubali Director Rajamouli meets Amitabh Bachchan

Baahubali director rajamouli meets amitabh bachchan

Rajamouli meets amithabh bachchan, Baahubali Director Rajamouli meets Amitabh Bachchan, Director Rajamouli in sarkar 3 shooting, Sarkar with Jakkana, Jakkanna with Big B

Baahubali Director Rajamouli meets Amitabh Bachchan in sarkar 3 sets.

సర్కార్ సెట్లో రాజమౌళి సందడి

Posted: 10/28/2016 09:31 AM IST
Baahubali director rajamouli meets amitabh bachchan

రాంగోపాల్ వర్ సర్కార్-3 విడుదలకు ముందే సంచలనాలకు తెరలేపుతోంది. వివాదాలతో కాదు... సెట్ లో స్పెషల్ గెస్ట్ లతో. ఈ మధ్యే నటసింహ బాలయ్య బిగ్ బీని కలిసి షూటింగ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడే కాసేపు కలయతిరిగిన బాలయ్య చివరికి 151వ చిత్రం కోసం అమితాబ్ ను ఓ పాత్ర కోసం ఒప్పించేసుకున్నాడు. ఇక ఇప్పుడు జక్కన్న వంతు వచ్చింది.

బాహుబలి-ది కంక్లూజన్ షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చిన రాజమౌళి వెంటనే ముంబైకి చెక్కేసి అమితాబ్ ను కలిశాడు. ఎంచక్కా అక్కడ ఆయనతో కాసేపు ముచ్చటించాడు. ఆ తర్వాత అమితాబ్ తన ట్విట్టర్ లో రాజమౌళి గురించి పొగిడాడు చూడండి. సింపుల్ అండ్ హంబుల్ అంటూ ట్వీట్ వేశాడు. వర్మతో కూడా కాసేపు ముచ్చటించి, బాహుబలి వీఆర్ అనుభూతిని అతనికి పంచాడు. ఇక ఆ వీడియో చూసిన ఆర్జీవీ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు.

బాహుబలి-2 ప్రమోషన్ కోసమే ఈ కలయిక జరిగిందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో బాహుబలి పార్ట్ 1 ని ఎంతో ఎంకరేజ్ చేసిన బిగ్ బీ, ఆ సమయంలో రానాతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించాడు. అవకాశం వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానన్న అమితాబ్ ఆ సందర్భంగా కూడా బాహుబలిని ఆకాశానికి ఎత్తేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali director  Rajamouli  Amithabh Bachchan  sarkar 3 sets  

Other Articles