మంచు లక్ష్మిని ఇమిటేట్ చేసిన ఆంధ్రాపోరి మీరూ చూడండి.. | Manchu Lakshmi Spoof by a Andhra girl.

Manchu lakshmi spoof by a girl goes viral

Manchu Lakshmi, Manchu Lakshmi Spoof, Manchu Lakshmi video, Manchu Lakshmi Spoof By a Andhra Girl, Girl Imitate Manchu Lakshmi, Manchu Lakshmi, Manchu Girl, Manchu Lakshmi Video, Manchu Lakshmi Language, Manchu Lakshmi Funny video, Manchu Lakshmi imitation

Manchu Lakshmi Spoof By a Andhra Girl Goes viral Now.

మంచు లక్ష్మిని భలేగా ఇమిటేట్ చేసింది

Posted: 11/12/2016 03:20 PM IST
Manchu lakshmi spoof by a girl goes viral

మంచువారమ్మాయి లక్ష్మికి టాలీవుడ్ లో ఓ సపరేట్ ట్రెండ్ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పుడున్న పవర్ ఫుల్ లేడీ యాక్టర్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటూ ఆమెను ఇండస్ట్రీ పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. అయితే కంప్లీట్ గా అమెరికాలో పెరిగిన లక్ష్మికి ఎటోచ్చి ఒక భాషలోనే పాపం పట్టుతక్కువ.

ఆ మధ్య మేము సైతంకు హాజరైన సమంతతో నా..కన్నా ను...వ్వే టెలుగు స్ప..ష్టంగా మాట్లాడుతున్నావ్.. అంటూ లక్ష్మి చెప్పటం తెలిసిందే. ఏదేమైనా డైలాగ్ డెలివరీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న మోహన్ బాబు తనయురాలు అయినప్పటికీ, తాను తెలుగు భాషను ఉచ్ఛరించే విధానం కర్ణకఠోరంగా ఉంటుందనేది స్వయంగా ఆమె ఒప్పుకుంటుంది.

ఇక తెలుగు ఉచ్చారణపై గతంలో ఎన్నోసార్లు నెటిజన్లు కామెంట్స్ చేయటమే, బన్నీలాంటి పలువరు సినీ సెలబ్రిటీలు కూడా సినిమాల్లో ఇమిట్ చేస్తూ డైలాగులు చెప్పటం చూశాం. అయితే తాజాగా మంచులక్ష్మి పేరిట ఓ స్పూఫ్ వీడియో భలేగా వైరల్ అవుతోంది. ఎక్కడ చేశారో తెలీదు కానీ, ఓ అమ్మాయి మంచులక్ష్మి డైలాగులను అదే స్లాంగ్ తో అద్భుతంగా చెప్పింది. గుండెల్లో గోదారి సినిమా టైంలో మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ ఈజ్ గా దించేసి నవ్వులు పూయించింది. వీడియో తీసిన సదరు వ్యక్తి కూడా పడి పడి నవ్వటమే కాదు, సదరు డైలాగులపై సెటైర్లు కూడా వేశారు. ఫన్నీగా సాగిన ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Spoof Video  Andhra Girl  

Other Articles