బాబీ సినిమా కోసం కొత్త కొత్త ట్విస్టులు | NTR Bobby movie details.

Ntr new movie opening details

NTR new movie, NTR Bobby Movie, NTR bobby project, NTR new movie launch, NTR Bobby movie launch, Junior NTR Bobby movie

NTR double role and blind character for Bobby movie. Movie launch date confirmed.

ఎన్టీఆర్ కొత్త సినిమా క్లారిటీ

Posted: 12/06/2016 11:52 AM IST
Ntr new movie opening details

ఇండస్ట్రీకి మూడో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'జనతా గ్యారేజ్' తో అందించాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పుడెప్పుడో నందమూరి సాధించిన ఆల్ టైం రికార్డులను మళ్లీ ఇన్నేళ్లకు చెరిపి టాప్ 5 లో నిలిచాడు తారక్. అయితే అంతటి ఘన విజయం తర్వాత ఎలాంటి కథను ఎంచుకోబుతున్నాడా? అన్న డౌట్ అందరిలోనూ మొదలైంది. కథల మీద కథలు వింటూ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడంటూ అంతా భావించారు. అయితే ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

వైవిధ్యభరితమైన సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్న ఎన్టీఆర్ చివరికి బాబీ వినిపించిన కథకే ఓటేశాడని సమాచారం. 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి భారీ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ, కథపై గల నమ్మకంతోనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మరుసటి రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కథానాయికను .. ఇతర తారాగణాన్ని ఎంపిక చేసి అదే రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Director Bobby  NTR New movie launch  

Other Articles