చెర్రీ లుక్ పై మంచు విష్ణు అలా కామెంట్ చేశాడేంటి? | manchu vishnu comments on ram Charan six pack.

Manchu hero complement to ram charan six pack

Dhruva Movie, Manchu Vishnu, Vishnu Ram Charan, Ram Charan Six Pack, Cherry six pack, Manchu hero Mega Family, Mega Hero Manchu Hero, Manchu Vishnu and Ram Charan, Ram Charan and Manchu Vishnu, Manchu Mega Family, Ram CHaran sexiest, Vishnu calls Cherry as Sexy

Manchu Vishnu praises ram Charan sic pack look for Dhruva.

చెర్రీని సెక్సీ అంటూ కామెంట్ చేసిందెవ్వరు?

Posted: 12/06/2016 01:02 PM IST
Manchu hero complement to ram charan six pack

మెగా పవర్ స్టార్ కి అనుకోని కాంప్లీమెంట్ వచ్చింది. ధృవ సినిమా కోసం చెర్రీ సిక్స్ ప్యాక్ కష్టం, హర్డ్ వర్క్ అదంతా వీడియో ప్రోమోలో చూపించేయటం తెలిసిందే. వర్కవుట్ లతో బాడీ షేప్ ను టోటల్ గా మార్చేసిన చెర్రీ మొత్తం టాలీవుడ్ కే కాదు, బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లకు కూడా షాకిచ్చాడు. ఇక మాములుగా అయితే కాంప్లీమెంట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, చేసింది మంచు ఫ్యామిలీ కావటంతోనే అది స్పెషల్ గా మారింది.

ఒక వేళ ఇది సెక్సీ కాకపోతే.. దానికి అసలు మీనింగే లేదు. కఠోర శ్రమ మరియు డెడికేషన్ అంటే ఇదేనేమో. ఆల్ ది బెస్ట్ అంటూ మంచు విష్ణు ట్వీట్ వేశాడు. మాములుగా మోహన్ బాబు, చిరు టామ్ అండ్ జెర్రీ గేమ్ ను పక్కనబెడితే, మంచు, మెగా ఫ్యామిలీ యంగ్ జనరేషన్ అంతా కలిసే ఉంటుంటారు. ఈవెంట్లలో కలిసి పాల్గొనటం, పార్టీలు, ఒకరి సినిమాను మరోకరు అభినందించటం లాంటివి చాలానే చేశారు కూడా.

 

ఇక వీడియోలో రాంచరణ్ మజిల్ పవర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోంటోంది. వావ్... అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ధ్రువ టైటిల్ సాంగ్ మేకింగ్ లో చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. మరి సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో తెలియాలంటే ిఇంకో మూడు రోజులు ఓపిక పట్టాల్సిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Mega Power Star  Ram Charan  Dhruva six Pack  

Other Articles