కృతి సనన్ కొత్త నోట్ల గౌన్.. ఎలా వచ్చాయంటే... | Mahesh's Heroine in Rs 2000 Note Dress.

Kriti sanon wearing 2000 note dress

Kriti Sanon Rs 2000 note, Kriti Sanon morphed photos, Kriti Sanon Twitter, Kriti Sanon morphing, Kriti Sanon new 2000 note, Kriti Sanon 2000 note gown, Morphing Kriti Sanon pic, Kriti Sanon wearing 2000 dress, mahesh's Heroine Kriti Sanon

Kriti Sanon spotted wearing the new 'Rs 2000 note' dress was fake.

కొత్త నోట్ల గౌన్.. అసలు కథ ఏంటంటే...

Posted: 12/14/2016 10:44 AM IST
Kriti sanon wearing 2000 note dress

పెద్ద నోట్ల రద్దుతో, ఇప్పుడు డబ్బులు లేక జనాలు... దేశం మొత్తం మీడియాలో నడుస్తున్న ఏకైక టాపిక్ ఇదే. బ్యాంకులు, ఏటీఎం ల ముందు క్యూలు కట్టేస్తూ కరెన్సీ కష్టాలు అనుభవిస్తున్నారంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సెలబ్రిటీల కష్టాలను కూడా తెలియజేస్తున్న మాధ్యమాలు ఓ గమ్మతైన వార్తను మొన్న ప్రసారం చేశాయి.

మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ గుర్తుంది కదా. ఆ భామ ఓ ఈవెంట్ కి వేసుకొచ్చిన డ్రెస్ గురించి. అందులో 2 వేల నోట్లతో డిజైన్ చేసిన గౌన్ తో కనిపించి తళ తళలాడిపోయింది. పోనీ అది డిజైనా అనుకంటే అదీ కాదు. మొత్తం పెద్ద నోటుతోనే నింపేశారు. అంతే కెమెరా కళ్లు క్లిక్ మనిపిస్తే ఛానెళ్లన్నీ కాసేపు కరెన్సీ కష్టాలను పక్కనబెట్టి ఆ వార్తనే ప్రసారం చేశాయి.

అయితే అది ఫోటో షాప్ మహాత్యం అని కాస్త ఆలస్యంగా తెలిసింది. నిజానికి ఆ ఫంక్షన్ తాను ఏ డ్రెస్ వేసుకోచ్చానో చూడండి అంటూ కృతి సనన్ మరో ఫోటో పోస్ట్ చేసింది. మార్ఫింగ్ లో చేయి తిరిగిన వ్యక్తి ఎవరో దానిని సోషల్ మీడియాలో పెట్టేయగా, వెర్రిగా అది వైరల్ అయిపోయింది.

''వాళ్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను సర్కులేట్ చేయడమేంటో.. ఈ పాపులర్ మీడియాలన్నీ ఆ ఫోటోను ప్రచురించడం ఏంటో.. నాకు చిరాకొస్తుంది'' అంటూ చెప్పింది. ''ఈ ఫోటో షాప్ మ్యాజిక్ ను నిజం అనుకునే ఆ చిన్న చిన్న మెదడులకు ఒక దణ్ణం'' అంటూ కామెంట్ కూడా చేసింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu's Heroine  Kriti Sanon  2000 notes dress fake  

Other Articles