ఖైదీలో చివరి సన్నివేశం ఏంటంటే... | Khaidi No 150 last shot funny.

Vinayak did it again for chiru

Khaidi no 150 shooting, Khaidi No 150 Chiru direct, Chiru direct Vinayak, Vinayak in Khaidi, Khaidi no 150 last scene, Khaidi 150 last scene, Chiru Vinayak, Vinayak again did it for chiru, Chiru last scene, Chiru mega phone, Chiranjeevi directing, Vinayak guest role in Khaidi

Khaidi no 150 shooting completed. Chiranjeevi turns director as well as Director vinayak acted in that scene.

చిరు డైరక్షన్.. వినాయక్ యాక్షన్

Posted: 12/14/2016 11:22 AM IST
Vinayak did it again for chiru

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150th సినిమా ఖైదీ నంబర్ 150 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. చివరి షాట్ కు చిరు దర్శకత్వం వహించగా, చిత్ర దర్శకుడు వినాయక్ నటించటం విశేషం.

నెత్తికి కర్చీఫ్ కట్టుకుని పక్కా మాస్ గెటప్ లో చేతిలో ఓ బిందెతో వినాయక్ నడిచివెళ్లటం, చిరు షాట్ ఓకే చెప్పటం, చివరకు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ అందులో ఉంది. షూటింగ్ పూర్తయిపోయి సంగతిని అధికారికంగా వెల్లడించాడు చెర్రీ. అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. అంటే గతంలో ఠాగూర్ లో ఓ కీలక పాత్రలో మెరిసిన వినాయక్ ఇందులోనూ ఓ రోల్ లో కనిపించబోతున్నాడన్న మాట. దీనికి ముందు ఓ మాస్ సాంగ్ షూటింగ్ ను చేసిన యూనిట్ అందులోనే వచ్చే బ్యాగ్ గ్రౌండ్ మ్యూజికల్ లో చిరు చెర్రీతో కూడా స్టెప్పులేయించాడంట. ఇక మెగాస్టార్ సరసన డాన్స్ తో తన డ్యాన్సింగ్ స్టైల్ మారిపోయిందంటూ కాజల్ కూడా చెప్పిదంటే బాస్ ఏ రేంజ్ లో కుమ్మేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. 


సో... ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగం పుంజుకోవడం ఖాయం. తమిళ హిట్ మూవీ కత్తికి రీమేక్ గా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజ్ కానున్న ఖైదీ నంబర్ 150 తో మెగా కమ్ బ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiru direction  Vinayak action  Khaidi No 150 shoot completed  

Other Articles