మహేష్ ట్విట్టర్ లో.. చరణ్ ఫేస్ బుక్ లో... | cherry Happy Holidays With Mahesh.

Ram charan joins superstar holiday trip

Ramcharan, Mahesh babu, Ramcharan and Mahesh babu, Mahesh Babu and Ram Charan, Mahesh share Ram Charan, Cherry post Mahesh Babu, Mahesh And Charan Switzerland, Mahesh Babu amily Switzerland, Ram Charan and Upasana Switzerland, Ramcharan and Mahesh babu holiday time, Mahesh babu Galla Jayadev Ram Charan, Mahesh Babu new year, am Charan New year, Super Star Mega Power Star, Cherry with Mahesh

Ramcharan and Mahesh babu enjoying holiday time in Switzerland. Mahesh shared in twitter and Ram Charan posted in Facebook.

మహేష్ హాలీడేస్ లో చెర్రీ జాయిన్ అయ్యాడు

Posted: 12/29/2016 10:28 AM IST
Ram charan joins superstar holiday trip

ఫ్యాన్స్ అనే వార్ అనే చెండాలమైన సంప్రదాయానికి బీజం వేసింది ఎవరైనా దాని ఫలితం మాత్రం ఇప్పటి తరాలు కూడా అనుభవించక తప్పటం లేదు. ఆ మధ్య ఇద్దరు అగ్రహీరోల అభిమానులు కొట్టుకోవటం, ఓ అభిమాని(వ్యక్తి) ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఆయా హీరోలు ఇలాంటి అభిమానం మాకు అక్కర్లేదని ప్రకటించారు కూడా. కానీ, ఆవేశాన్ని ఆపొచ్చుగానీ, వెర్రి తలలు వేసే వారి అభిమానం ఆపలేం కదా.

ఇప్పటికీ అరకొర ఫ్యాన్స్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో హీరోలు బయటి పంక్షన్ వెళ్లాలన్న, అక్కడ ఏమన్నా మాట్లాడాలన్నా జంకుతున్నారు. ఏం మాట్లాడితే ఎవరి అభిమానులు ఏకేస్తారేమోనన్న భయమే ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు... అభిమానుల సంగతి ఎలా ఉన్నా.. హీరోల మధ్య మాత్రం మైత్రి ఎప్పటికీ వర్థిల్లుతూనే ఉంది. ముఖ్యంగా కొందరు అగ్రహీరోలు యువ హీరోలను ఎంకరేజ్ చేయటం, తరచూ వారి పార్టీల్లో సందడి చేయటం కూడా చూస్తున్నాం.

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న ప్రిన్స్ అతి తక్కువ మందితో రిలేషన్ మెయింటెన్ చేస్తుంటాడు. వారిలో మెగా వారసుడు రాంచరణ్ కూడా ఉన్నాడు. శ్రీమంతుడు రిలీజ్ టైంలో ఇండస్ట్రీ నుంచి ఒక్క రాంచరణే తనకు ఫోన్ చేసి అభినందించాడని మహేష్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ ఒకే దగ్గర కలిస్తే ఊరుకుంటారా? మురుగదాస్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మహేష్ ఈ మధ్య స్విటర్జాలాండ్ కు తన ఫ్యామిలీతో చెక్కేశాడు. ధృవ విజయాన్ని ఎంజాయ్ చేసి థాంక్స్ మీట్ తర్వాత చెర్రీ కూడా అక్కడికే హాలీడేస్ కు వెళ్లాడు. ఇక ఈ ఇద్దరూ ఇలా ఒకే దగ్గర కలుసుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో మహేష్ బావ, ఎంపీ గల్లా జయదేవ్, బుల్లి ప్రిన్స్ గౌతమ్ కూడా ఉన్నారు. షార్ట్ హాలీవుడ్.. ఎల్లలు దాటిన ఎంజాయ్ మెంట్ అంటూ ఈ ఫోటోను చెర్రీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మరి మహేష్ ఊరుకుంటాడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Ram Charan  Switzerland Holidays  

Other Articles