టాలీవుడ్ లో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇంతకు ముందు ఏడాదికి ఒక్క సినిమా రావటమే గగనంగా మారిపోయిన క్రమంలో నాని లాంటి వాళ్లైతే మూడేసి సినిమాల చొప్పున అలరిస్తున్నారు. ఇక సుప్రీం హీరో అని పిలిపించుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కూడా రెండు సినిమాలకు తక్కువేం చేయటం లేదు.
గతేడాది సుప్రీం, తిక్క సినిమాలతో మిక్స్ డ్ ఫలితాలను చవిచూసిన సాయి విన్నర్ గా త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇదిలా ఉంటే మరో కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశాడు తేజూ. బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ అనే ఓ సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది.
అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తాడని అంతా అనుకున్నారు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'మా జవాన్ మూవీకి తొలి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టడంతో.. ఎగ్జైటింగ్ ప్రారంభం లభించింది. సాయిధరంతేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా.. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ చిత్ర యూనిట్ ఫోటోలను షేర్ చేసింది.
మెగా-నందమూరి ఫ్యాన్స్ వార్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఇలా ఎన్టీఆర్ మెగా హీరో చిత్రానికి క్లాప్ కొట్టడం, ఆపై విషెష్ చెప్పటం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్-కళ్యాణ్ రామ్ హీరోగా ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కేందుకు యత్నాలు జరుతున్నాయన్న వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కథ ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జవాన్ లో హీరోయిన్ గా కృష్ణగాడి వీరప్రేమ గాథ ఫేమ్ మెహ్రీన్ కౌర్ పీర్జాదా నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more