ప్రీ లుక్: చెర్రీని ఎప్పుడూ ఇలా చూడలేదు | Ram Charan pre look for Sukumar Movie.

Ram charan sukumar movie launched

Ram Charan, RC11 launch, Chiranjeevi Ram Charan, Ram Charan New Movie Launch, Ram Charan Sukumar Movie, Ram Charan Sukumar Pre Look, pre look of RC11, pre look of Ram Charan Sukumar Movie, Ram Charan Sukumar Chiranjeevi, RC11 launched

Ram Charan New Movie Launched by Chiranjeevi under Sukumar Direction. Devisri Prasad compose tunes, And Samantha in female lead.

చెర్రీ-సుక్కూ సినిమా మొదలైంది

Posted: 01/30/2017 12:51 PM IST
Ram charan sukumar movie launched

కాస్త గ్యాప్ తర్వాత ధృవతో సాలిడ్ హిట్ కొట్టిన మెగాపవర్ స్టార్ కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ ను ఈ ఉదయం ముహుర్తం లాంఛ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు, మరో స్టార్ దర్శకుడు కొరటాల శివ కూడా హాజరై పూజలో పాల్గొన్నారు. అంతేకాదు ఫస్ట్ లుక్ తో కూడా సందడి చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.

గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా అభిమానులు చాలా ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చెర్రీ ఓ రైతు కుటుంబంలోని యువకుడిగా కనిపించబోతున్నాడని, ప్రేమ కథగా ఇది ఉండబోతుందని కూడా చెప్పుకున్నాం. అందుకు తగ్గట్లే ఈ ప్రీ లుక్ పోస్టర్ ఉంది. రెండు బిందెలను కావడిలో మోస్తున్న హీరో లుక్.. స్కెచ్ రూపంలో ఉంది.

మరోవైపు ఇది పీరియాడికల్ మూవీ అనే ఓ టాక్ కూడా ఉంది కూడా. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సమంతను హీరోయిన్ గా ఇప్పటికే ఎంపిక చేయగా, దానిపై కూడా క్లారిటీ ఇచ్చేసింది చిత్ర యూనిట్. ఇక ఆర్సీ 11 అన్న యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం.

Ram Charan Sukumar Movie Launch

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ram Charan  Sukumar  Movie  RC11  Launch  

Other Articles