అటు పవన్ కళ్యాణ్.. ఇటు సమంత.. చేనేత బ్రాండ్ అంబాసిడర్ లుగా... కేటీఆర్ ఫ్లాన్ | For Telangana Samantha, AP Pawan Kalyan Hand loom brand ambassadors.

Samantha to promote telangana handlooms

Samantha KTR, Samantha Telangana Brand Ambassador, Telangana Hand loom Ambassador, Samantha Hand Loom, Pawan Kalyan Samantha Hand Loom, AP Telanagana hand loom brand ambassadors, Samantha 2017

Actress Samantha is brand ambassador for telangana handlooms.

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత

Posted: 02/01/2017 08:38 AM IST
Samantha to promote telangana handlooms

ఇలా అఫీషియల్ గా అక్కినేని ఇంటి కోడలిగా ప్రమోషన్ అయ్యిందో లేదో (ఎంగేజ్ మెంట్) సౌత్ బ్యూటీ సమంతకు అప్పుడే కీలక బాధ్యతలు వచ్చిపడ్డాయి. తమ పథకాల కోసం స్టార్లను వాడుకునే ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మపై కన్నేశాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతను ఎంపిక చేసింది.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమంత భేటీ అయ్యి ఈ విషయాన్ని ధృవీకరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ కోరగా అందుకు ఆమె అంగీకరించింది. తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రచారం చేసేందుకు.. ఈ తెలుగింటి కోడలు రెడీ అయిపోయింది. కేటీఆర్ చేతుల మీదుగా ఈ బాధ్యతలు అందుకోవడమే కాదు.. హ్యాండ్ లూమ్స్ తో సందడి చేసింది సమంత.

చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆమె మంత్రిని అడిగి తెలుసుకున్నారు. చేనేత దుస్తుల ప్రచారానికి సంబంధించి తన వద్ద ఉన్న ఆలోచనలను కేటీఆర్‌కు వివరించింది. రాష్ట్రంలోని పలు చేనేత క్లస్టర్లను తాను సందర్శించానని, కరీంనగర్‌లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేసినట్లు కేటీఆర్‌కు సమంత తెలిపింది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేసే మంత్రి కేటీఆర్ సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం ద్వారా మరో మెట్టు ఎక్కేశాడు. మరోవైపు అగ్రనటుడు పవన్ కళ్యాణ్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  చేనేత మన జాతి సంపద-పవన్

మరోవైపు నిన్నటికి నిన్నే చైతు-సమంత నిశ్చితార్ధం అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి ఎప్పుడన్న దానిపై నాగ్ క్లారిటీ ఇచ్చేశాడు. జనవరిలో నిశ్చితార్థం చేసుకుంటానన్నాడు, వాడి ఇష్ట ప్రకారమే చేశాము, పెళ్లి విషయంలోనూ అంతే. నాగ చైతన్య, సమంతలు ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని నాగ్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Telangana  Hand loom  Brand Ambassador  

Other Articles