పవన్ ను వాళ్లు చంపేస్తామని బెదిరించారంట | Pawan Kalyan also got death threat.

Once pawan kalyan got death threat

Pawan Kalyan, Pawan Kalyan Death Threat, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Common Man Protection Force, Janasena Pawan Kalyan

Pawan Kalyan says once he got death threat. "When I started CPF (Common Man Protection Force) or entered into politics, so many have threatened me in so many ways that I'd be killed. Even I've received many letters, mails abusing me. I never bothered. Had I not want to be in politics, why would I take these risks? I'd have sit happily at home and would be roaming Holywood studios, theme parks."

ధైర్యంగా ఒకేసారీ చావటం మేలు-పవన్

Posted: 02/11/2017 01:27 PM IST
Once pawan kalyan got death threat

రెండు పడవల మీద ప్రయాణం కష్టమని తెలిసినప్పటికీ, వ్యక్తిత్వంకు కట్టుబడి, ప్రజలకు తానిచ్చిన కమిట్ మెంట్ కారణంగానే తాను ఇలా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్ న్యూ హంప్ షైర్ లో జరిగిన ఓ మీటింగ్ లో ఆసక్తికర విషయాలనే చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఒకానోక టైంలో తనని చంపేస్తామని కూడా బెదిరించారంట.

కామన్ మాన్ ప్రోటెక్షన్, జనసేన పార్టీ స్థాపించన సమయంలో చంపుతామని కొందరు బెదిరించారు. అంతేకాదు తనను తిడుతూ పలువురు లేఖలు, మెయిల్స్ కూడా పంపించారంట. కానీ, ఎనాడూ వాటి గురించి పట్టించుకోలేదని తెలిపాడు. అసలు నాకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? మిగతా వాళ్లలాగా నేను సినిమాలు తీసుకుంటూ హాయిగా కుటుంబంతో సరదాగా ఉండొచ్చు కదా, వారితో కలిసి హాలీవుడ్ స్టూడియోల చుట్టూ చక్కర్లు కొట్టేవాడిని కదా! కానీ, నేను అలా కాదు. దేశం నీకు ఏం ఇచ్చింది అనే దాని కన్నా దేశానికి నువ్వు ఏం ఇచ్చావ్ అన్న ఆలోచన ఉన్న వ్యక్తిని, అందుకే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని తెలిపాడు.

ఒకవేళ ఆ బెదిరింపులకు తలొగ్గి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా! భయపడుతూ ప్రతీరోజు బతికే కన్నా ధైర్యంగా ఒకేసారీ చావటం మేలు. నేను ప్రతీది ఆలోచించి చేస్తాను. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించే తీసుకుంటాను. సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యవంతంగా ఫీల్ కాలేదన్న పవన్, ప్రజల సమస్యలపై పోరాటమే తనకు అంతులేని తృప్తిని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Janasena  Pawan Kalyan  Death Threat  

Other Articles