ముందు చావగొట్టి.. ఆపై సంజయ్ దత్ ఏం చేశాడో చూడండి | Sanjay Dutt is seen holding the hands of the media personnel and asking apology.

Sanjay dutt apology to media

Sanjay Dutt Apology, Bhoomi Movie Shooting, Sanjay Dutt Bouncers Attack, Sanjay Dutt Sorry Video, Sanjay Dutt Media, Sanjay Dutt, Hero Bouncers Attack Media, Sanjay Dutt Bhoomi Movie

Hero Sanjay Dutt bodyguards beaten up the media personnel at the sets. However, the big star has had apologized the media guys by literally holding their hands for his bodyguards manhandling them.

బౌన్సర్ల దాడిపై సంజయ్ దత్ సారీ చెప్పాడు

Posted: 03/04/2017 10:20 AM IST
Sanjay dutt apology to media

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ పై మరో కేసు నమోదయ్యింది. జర్నలిస్ట్ లపై తన వ్యక్తిగత సిబ్బందితో దాడి చేయించటంతో వారంతా ఆయనపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి కూడా నెట్ లో వైరల్ అయ్యింది. నల్ల దుస్తులు ధరించిన బౌనర్లు మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు కురిపిస్తూ తరిమి కొట్టారు.

సంజయ్ దత్ కొత్త చిత్రం భూమి షూటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర దర్శకుడు, నిర్మాత చెప్పటంతోనే సంజూ సిబ్బంది తమపై, షూటింగ్ చూడటానికి వచ్చిన కొందరు స్థానికులపై కూడా దాడికి పాల్పడ్డారని వారు పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. దీంతో హుటాహుటినా వాళ్ల దగ్గరికి వెళ్లిన సంజయ్ క్షమాపణలు కోరాడు. వారి చేతులు పట్టుకుని మరీ, సిబ్బంది తరపున సంజయ్ సారీ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

భాయే స్వయంగా క్షమాపణలు చెప్పటంతో వెనక్కి తగ్గిన మీడియా ప్రతినిధులు కేసు వాపసు తీసుకున్నారు. అయితే షూటింగ్ లేట్ చేసి సాధారణ పౌరులకు భంగం కలిగించారన్న దానిపై మాత్రం చిత్ర యూనిట్ పై కొత్త కేసు నమోదు కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sanjay Dutt  Bouncers Attack Media  Apology  

Other Articles