Kamal Haasan Mahabarat Comments Case backfires

Court slams political party for case against kamal haasan

Kamal Haasan Mahabarat Complaint, Kamal Haasan Case, Kamal Haasan Hindu Makkal Katchi, Hindu Makkal Katchi Bala, Kamal Haasan Case Quashed, Kamal Haasan Insult Mahabarat, Hindu Makkal Katchi Bala, Hindu Makkal Katchi Celebrities Case, Case Against Celebrities, Kamal Haasan Comments, Kamal Haasan Statement, Kamal Haasan BJP

Judge Dismisses Mahabarat Complaint Against Kamal Haasan. Court slams political party for case against Kamal Fine On Petitioner.

మహాభారతం కామెంట్లు.. కమల్ పై కేసు కొట్టివేత

Posted: 04/29/2017 01:08 PM IST
Court slams political party for case against kamal haasan

మహాభారతంలో ద్రౌపది పాత్రను కించపరిచేలా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశాడని తీవ్ర దుమారం రేగగా ఏకంగా కోర్టులో కేసు వేయటంతో ఆయనకు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే తర్వాతి వాదనలో ఆయనకు ఊరటనిస్తూ కేసును కొట్టేసింది. అదే సమయంలో పిటిషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా.

హిందూ మక్కల్ కట్చి సెక్రటరీ కే బాలకు సెలబ్రిటీలపై కేసు వేయటం కొత్త కాదు. గతంలో ఇలా చాలా మంది పైనే పిటిషన్ లు వేశాడంట. కేవలం వ్యక్తిగత ప్రచారం కోసమే బాల కేసులు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనకాల రాజకీయ పార్టీల ప్రభావం ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన కోర్టు కేసును కొట్టి వేయటంతోపాటు పదివేల జరిమానాను విధిస్తూ కమల్ కి ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత స్వేచ్ఛ కిందికే వస్తాయని కమల్ తన తరపున వాదన వినిపించాడు. మహాభారతంలో పాంచాలిని జూదంలో ఓ వస్తువులా వాడారని, దానిని ఇప్పటికీ మనం పవిత్ర పుసక్తంలా(ఇతిహాసం) భావిస్తూ పూజిస్తున్నామని కమల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన ను టార్గెట్ ను చేసిన ఆ పార్టీ(బీజేపీ అని చెప్పుకుంటున్నారు) పని పట్టే పనిలో కమల్ అనుచరులతో చర్చలు జరుపుతున్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Mahabharat Comments  Petition Dismiss  

Other Articles