బాలీవుడ్ నుంచి రాజకీయ రంగంలోని ప్రముఖులకు.. అంతటితో ఆగకుండా ఏకంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ చుట్టూ ఈ ప్రకంపనలు అలుముకున్నాయి. ఒక్కరితో ప్రారంభమైన అరోపణలు.. తాజాగా ఏడుగురు పిర్యాదు చేసే వరకు చేరాయి. ఇలా ఉదృతంగా సాగుతుంది మీటూ ఉద్యమం. ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల సపోర్ట్ గా నిలుస్తున్న టాలీవుడ్ సింగర్ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. బాధితురాలు తనకు జరిగిన ఘోరమైన అనుభవాన్ని చిన్మయితో షేర్ చేసుకుంది.
మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును ట్వీటర్ వేదికగా వివరించగా, అమె అదే పోస్టును సభ్యసమాజానికి తెలియజేసింది. బాధితురాలు మలింగ గురించి చిన్మయికి ఇలా తెలిపింది. కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్ లో తనకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది IPL సీజన్ కావడంతో శ్రీలంక ఫేమస్ క్రికెటర్ మలింగా కూడా అదే హోటల్లో ఉన్నాడు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే.. ఒకరు ఆమె మలింగా రూంలో ఉందని చెప్పారు.
దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం నన్ను బెడ్ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్ ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్ రూంకు వెళ్లి నా ఫేస్ ను కడుక్కున్నాను. హోటల్ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను.
ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్ క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తాను అనుభవించిన నరకాన్ని కూడా స్వచ్చంగా, స్వేచ్ఛగా చెప్పనీయకుండా చేశారని బాధిత యువతి తన గోడును తెలిపింది. భాదితురాలి వ్యధను అర్థం చేసుకున్న చిన్మయి మలింగ అకృత్యాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టింది.
Cricketer Lasith Malinga. pic.twitter.com/Y1lhbF5VSK
— Chinmayi Sripaada (@Chinmayi) October 11, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more