Big B As Gosayi Venkanna in Sye Raa ‘అమిత్ జీ’కి సైరా టీమ్ బర్తడే విషెస్..

Sye raa makers unveil big b s first look motion poster

Bollywood, Sye Raa Narasimha Reddy, amitabh bachchan, chiranjeevi, ram charan, nayanthara, surender reddy, tamannaah bhatia, Vijay Sethupathi, first look, Motion Poster, teaser, Happy Birthday Amitabh Bachchan, Amitabh Bachchan birthday, tollywood, movies, entertainment

Amitabh Bachchan turns 76 today. To mark the occasion of his bithday and treat his fans with a special surprise, the makers of Chiranjeevi starrer Sye Raa unveiled the first look motion poster teaser of Big B.

‘అమిత్ జీ’కి సైరా టీమ్ బర్తడే విషెస్..

Posted: 10/11/2018 07:10 PM IST
Sye raa makers unveil big b s first look motion poster

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం ఆయనకు 151 అనడం కన్నా.. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రసొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి బాటలోనే పయనిస్తూ.. ఆ చిత్రం ఫాలో అయిన ట్రెండ్ నే ఫాలో అవుతుంది.

అదేంటీ అంటారా.? బాహుబలి చిత్రం కూడా చాలా కాలం పాటు షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో.. ఆ సినిమాలో నటిస్తున్న ప్రధాన నటనబృందానికి సంబంధించిన జన్మదిన వేడుకల సందర్భంగా వారి తాలుకు సినిమా స్టిల్స్ ను విడుదల చేశారు. ఇదే ట్రెండ్ ను తాజాగా సైరా నరసింహారెడ్డి కూడా ఫాలో అవుతుంది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్ లను వారి బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ రిలీజ్ చేస్తోంది.

ఇక సైరాలో లీడ్ రోల్ లో నటిస్తున్న బిగ్ బి అమితాబ్ ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇవాళ(అక్టోబర్.11) బిగ్ బి 76f జన్మదిన వేడుకను పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీంతో సైరాలో ఆయన పోషించే కీలక పాత్రకు సంబంధించిన లుక్‌ తో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. గురువు పాత్రలో అమితాబ్‌ ఒదిగిపోయారు. ఆయన లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  Big B  Amitabh bachchan  gosayi venkanna  guru  tollywood  

Other Articles