Sarkar Issue solved outside court విజయ్ సర్కార్ విడుదలకు తొలగిన అడ్డంకులు..

Happy ending for sarkar controversy

Vijay, Sarkar, AR Murugadoss, Instagram, varun rajendra, Keerthy Suresh, Sun Pictures, Murugadoss Instagram, varun rajendra, Sarkar news, Sarkar controversy, Sarkar updates, Sarkar latest, Sarkar movie release date, publicity stunt, telugu films, teaser, trailers, syra, saaho, latest movie news, telengana, andhra pradesh, movies, entertainment, tollywood, kollywood

Happy ending for Sarkar Controversy: Vijay's recent outing Sarkar created a stir after landing into plagiarism issue that has been settled outside the court.

విజయ్ సర్కార్ విడుదలకు తొలగిన అడ్డంకులు..

Posted: 10/30/2018 06:16 PM IST
Happy ending for sarkar controversy

‘సర్కార్’ సినిమాపై వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రాన్ని తన కథతో తెరకెక్కించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రచయిత వరుణ్ రాజేంద్రన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందన్న క్రమంలో సినీ నిర్మాతలు ఈ అంశాన్ని కోర్టులో కాకుండా న్యాయస్థానం బయట పరస్పర చర్చల ద్వారా పరిష్కరించాలని అభిప్రాయానికి రావడంతో ఈ చిత్రం విడుదలపై ఏర్పడిన సంధిగ్థత ఎట్టకేలకు వీడింది.

ఈ చిత్రంలో కథను అందించిన వ్యక్తిగా వరుణ్ రాజేంద్ర పేరును స్ర్కీన్ పై వేస్తామని నిర్మాతలు అతనికి హామీ ఇచ్చారు. దీంతో న్యాయపోరాటానికి స్వస్తి పలికిన వరుణ్ రాజేంద్ర.. నిర్మాతలకు ఒప్పందాలకు సరేనన్నారు. అంతేకాదు ఈ చిత్రానికి కథ అందించినందుకు గాను నిర్మాతలు ముఫై లక్షల రూపాయలను కూడా అందిస్తామని కూడా ఒప్పంద పత్రాలలో పొందుపర్చారు. దీంతో వరుణ్ రాజేంద్ర చిత్ర విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తన కేసును వెనక్కు తీసుకున్నారు.

తాజాగా దీనిపై చిత్ర దర్శకుడు మురగదాస్ స్పందించారు. కొన్ని నెలల పాటు జరిపిన చర్చలతో ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్టు ఆయన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. ‘నకిలీ ఓట్లు సృష్టించి ప్రజాభిప్రాయానికి తావు లేకుండా చేయడం చాలా పెద్ద నేరం. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాను. సర్కార్ స్క్రిప్ట్ కోసం కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. వరుణ్‌ అనే రచయితకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చింది. తన స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించికున్నారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ సర్కార్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నాదే’’ మురగదాస్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Sarkar  AR Murugadoss  Instagram  varun rajendra  tollywood  kollywood  

Other Articles