బెల్లంకోండ శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు పలు చిత్రాలు వచ్చినా.. గర్వంగా చెపుకునేలా మాత్రం ఇప్పటి వరకు ఒక్క చిత్రం కూడా లేకపోయింది. దీంతో మంచి హిట్ కావాలని ఎదురుచూస్తున్న బెల్లంకొండ.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాలకు తనకు హిట్ అందిస్తాయని అశలు పెంచుకుంటున్నాడు శ్రీనివాస్.
అయితే నిజానికి ఈ చిత్రం కథను సాయిధరమ్ తేజ్ కోసం అనుకుని రచించాడు గోపిచంద్ మలినేని. క్రితం ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'విన్నర్' అనే సినిమా బాక్సాఫీసు వద్ద బోల్లా కోట్టింది. దీంతో సాయిధరమ్ తేజ్ అభిమానులు నిరాశకు గురైనట్లు భావించిన గోపీచంద్.. ఆ తరువాత సినిమాతోనైనా తేజుకి హిట్ ఇవ్వాలని భావించాడు. అందుకోసం అనూహ్యమైన మలుపులతో సాగే ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఇందుకు నిర్మాతలు కూడా సిద్దంగా వున్నారు.
ఈ కొత్త కథలో కొత్తదనం కారణంగా తేజు అంగీకరించడాని చెప్పుకున్నారు. కానీ వరుస పరాజయాలతో వున్న తేజు, ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తిని చూపించలేదని టాక్. దాంతో ఈ కథలో కాస్త మార్పులు చేసి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒప్పించాడు గోపీచంద్. అయితే కథ స్ర్కిప్ట్ విన్న తరువాత బెల్లంకొండ ఈ చిత్రానికి సరేనన్నారని సమాచారం. అయితే ప్రస్తుతం తేజ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం తరువాత గోపిచంద్ మలినేనితో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో వున్నాడట బెల్లంకొండ.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more