ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వర్మ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. వర్మ మార్క్ మూవీగా కన్నడ ప్రేక్షకుల నుండి ఊహించని స్థాయి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్రం శాండిల్ వుడ్ సినిమా రివ్యూవర్లతో పాటుగా ప్రేక్షకులను నుంచి కూడా మంచి స్పందన రాబట్టింది.
‘శంకర్ రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొదించిన ‘2.0’ చిత్రమా.. అదో చిన్న పిల్లల సినిమా. నా శిష్యుడు సిద్ధార్థ తాతోలు తీస్తున్నాడు చూడండి అసలు సిసలు పెద్దోళ్ల సినిమా ‘భైరవగీత’.. చూసి ఆనందించండి. ‘2.0’ మూవీ చిత్రానికి పోటీగా విడుదల చేస్తున్నా’ అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు సిద్ధార్థ తాతోలు సినిమా బైరవగీతకు తనదైన ప్రచారం నిర్వహించాడు. అయితే తన నిర్ణయంపై పునరాలోచనలో పడిన తరువాత వాయిదా వేసుకున్నాడు.
డిసెంబర్ 7న నాలుగు చిన్న సినిమాలు (కవచం, నెక్స్ట్ ఏంటి, సుబ్రహ్మణ్యపురం, శుభలేఖ+లు) బరిలో ఉన్నా.. నేనూ ఉన్నా అంటూ డిసెంబర్ 7నే ‘భరవగీత’ రిలీజ్ అంటూ ప్రకటించారు చిత్ర నిర్మాణ సంస్థ. అయితే థియేటర్స్ కొరత వల్ల వెనక్కి తగ్గి డిసెంబర్ 14 తేదీకి ఇక ఫిక్స్ అయిపోండి అంటూ ప్రకటించింది. అయితే కన్నడలో మాత్రం ముందుగా ప్రకటించినట్టుగానే.. డిసెంబర్ 7న విడుదల చేశారు.
ఈ సందర్భంగా వర్మ బైరవగీత చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. తన శిష్యుడు నిర్మించిన చిత్రానికి నేషనల్ వెబ్ సైట్స్ టాప్ రేటింగ్స్‌ను ఇవ్వడంతో వాటిపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తన అభిమానులతో కూడా ఆ రేటింగ్స్ ను పంచుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా 3. 5, డెక్కన్ క్రానికల్ 3, విజయ కర్ణాటక 3.5, కన్నడ ప్రభ 3, సినిమా ఎక్స్ ప్రెస్ 3 స్టార్లు ఇచ్చినట్టుగా వర్మ ట్వీట్ చేశారు. మరి తెలుగు ప్రేక్షకులు ‘భైరవగీత’కు ఎంత రేటింగ్ ఇస్తారో డిసెంబర్ 14న తేలిపోనుంది.
CONGRATS @Dhananjayaka @Irra_Mor @ThattSidd TIMES OF INDIA 3.5 STARS
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2018
DECCAN HERALD 3 STARS
VIJAYA KARNATAKA 3.5 STARS
KANNADA PRABHA 3 STARS
CINEMA EXPRESS 3 STARS #BhairavaGeetha releasing DECEMBER 14th pic.twitter.com/GfkcsF3v1u
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more