'Sita' is a layered film, a new story: Kajal Aggarwal ‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

Teja opens up about sita re shoot says it will be a hit

Bellamkonda Sreenivas, Kajal Aggarwal, Paruchuri Brothers, director Teja, teja on Sita re-shoot, audience, movies, entertainment, tollywood

Tollywood director Teja is outspoken and has a frank stand about his films before their release. During the pre-release event of his next release Sita, Teja spoke frankly saying that he attempted a good film and the result completely depends on how the audience accepts Sita.

‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

Posted: 05/21/2019 05:31 PM IST
Teja opens up about sita re shoot says it will be a hit

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి లేడి ఓరియంటెండ్ చిత్రంలో నటిస్తున్న సీత చిత్రంపై తనకు పూర్తి నమ్మకం వుందని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రంలో.. ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటిస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు తేజ బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'సీత' పాత్రకి కాజల్ సరిగ్గా సరిపోయింది. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రకి ఆమె పూర్తిన్యాయం చేసింది. తప్పకుండా ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినది అవుతుంది. ఇంతకుముందు కాజల్ తో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ .. సోనూ సూద్ కూడా అద్భుతంగా నటించారు. అనూప్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.  

ఈ చిత్రం రీ-షూటింగ్ జరపడంపై కూడా ఆయన పెదవి విప్పారు. తాను చిత్రాన్ని రూపొందించిన తరువాత దానిని పరుచూరి బద్రర్స్ కు చూపించానని, వారు కొన్ని సన్నివేశాలను జోడించాలని చెప్పడంతో.. తాను కొన్ని సన్నివేశాలను తొలగించి.. వారి సూచనల ప్రకారం కొన్ని సన్నివేశాలను జతచేశానని చెప్పుకోచ్చారు. అయితే తాను కళ్లద్దాలు పెట్టుకుని ఇంటెలిజెంట్ గా కనిపిస్తానని, కానీ తాను అంత వివేకిని కానని, తనకు చిత్రాలంటే ఇష్టమని, దాంతో చిత్రాలను రూపోందిస్తూనే వుంటానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bellamkonda Sreenivas  Kajal Aggarwal  Paruchuri Brothers  director Teja  tollywood  

Other Articles