దీపం ఉన్నపుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి మరీ.. rashmika mandanna skip out from dil raju movie

Rashmika mandanna skip out from dil raju movie

Rashmika Mandanna,Rashmika Movies,Tollywood,Rashmika

rashmika mandanna skip out from dil raju movie

దీపం ఉన్నపుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి మరీ..

Posted: 11/13/2019 12:41 PM IST
Rashmika mandanna skip out from dil raju movie

గీత గోవిందం సినిమాలో మన పక్కింటి అమ్మాయిగా, తన అమాయక అభినయంతో.. పదహారణాల తెలుగు యువతిగా, గోవిందు మెచ్చిన జీతగా గీతగా మన అందరిని ఎంతగానో అలరించిన రష్మిక ఇప్పుడు మన అందరి నుండి దూరం కాబోతుంది.. అవును నిజమే అంటున్నాయి సినీ వర్గాలు.. ఒక సినిమా విజయంతో తన రెమ్యూనరేషన్ నిఅమాంతం  పెంచిందని.. ఇలా పెంచితే ఎలా అని గుసగుసలు.. గీత గోవిందం తరవాత ఒక సరి అయినా హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు.. తాను నటించిన డియర్ కామ్రేడ్ మరియు దేవదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద  బోల్తా పడాయి.. అందం అభినయం ఉంటె సరిపోదు.. కొంచెం సహనం ఉండాలి అంటున్నారు.. చేతులారా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ ని కోల్పోతున్నారు రష్మిక.. ఈ కన్నడ ముద్దుగుమ్మ..  దిల్ రాజు నిర్మించబోయే ఒక తాజా  చిత్రం నుండి తప్పుకున్నది..  తన రెమ్యూనరేషన్ వల్లనే  పలు ముఖ్యమైన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లను కోల్పోతున్నది..

తెలుగు లో మంచి విజయం సాధించిన నాని నటించిన  క్రికెట్ కథ నేపథ్యం గా  వచ్చిన జెర్సీ చిత్రం మన  అందరిని ఎంతగానో ఆకట్టుకున్నది.. ఆ చిత్రాన్ని బాలీవుడ్ లోకి తసుకుపోనున్నారు.. నాని పాత్రను షాహిద్ కపూర్ నటిస్తుండగా అతని భార్య పాత్రలో రష్మిక ను ఎంచుకోబోతుండగా రష్మిక రెమ్యూనరేషన్ ని తెలుసుకొని ఆ  చిత్రం తప్పించారు..  దిల్ రాజు  కూడా ఈ  విషయం  తోనే  రష్మికను నుండి తప్పించారు.. నాగ చైతన్య తో కూడా  ఒక భారీ  సినిమా ని వదులుకోవాల్సి వచ్చింది.. ఈ భాదలని రెమ్యూనరేషన్ మూలంగానే... దీపం ఉన్నపుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి అంటారు.. కానీ మన రష్మిక తీరు అసలు అలా లేదు..  ఒక హిట్ రాగానే రెమ్యూనరేషన్ పెంచేసింది..ఇప్పటికైనా ఈ కన్నడ భామ మేల్కొని తన రెమ్యూనరేషన్ ని కొద్దిగా మన దర్శక నిర్మాతల  స్థాయికి ఉంచితే భవిష్య కాలంలో మరిన్ని నూతన మంచి చిత్రాలలో తాను నటించి మన ఆదరణ పొందుతుంది.. చూడాలి  ఏం  జరుగుతుందో.. రష్మిక  దిగుతుందో.. దర్శకనిర్మాతలు దిగుతారో ..ఎవరు దిగిన  మనకు నష్టం లేదు.. మన  చలన  చిత్రానికి  న్యాయం చేస్తే చాలు  కదా..

-శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmika Mandanna  Rashmika Movies  Tollywood  Rashmika  

Other Articles