Rana Daggubati to start working for Hiranya Kashyap ‘హిరణ్య కశిప’ కోసం సిద్దమౌతున్న దగ్గుబాటి

Rana daggubati to start working for hiranya kashyap

Rana Daggubati, Hiranya Kashyap, mythological drama, Gunasekhar, pan indai movie, Virata Parvam, sai pallavi, venu udugula, Tollywood, movies, Entertainment

After living in the US for months post a kidney-related surgery, Rana Daggubati is very much in Hyderabad. Now Rana is ready to work out director Gunasekhar project Hiranya Kashyap. The mythological drama has been in the planning for more than three years.

‘హిరణ్య కశిప’ కోసం సిద్దమౌతున్న దగ్గుబాటి

Posted: 11/13/2019 01:21 PM IST
Rana daggubati to start working for hiranya kashyap

బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అటు బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు చేజిక్కించుకుని బిజీగా మారిపోయిన నటుడు దగ్గుబాటి రానా.. తన కిడ్నీ సర్జరీ తరువాత అరోగ్యం కుదట పడిన నేపథ్యంలో ఇక చిత్రాలపైకి తన దృష్టిని మరల్చారు. ఆయన ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప' చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మరో వైపున షాట్ డివిజన్ తో సహా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. దీంతో ఆయన మళ్లీ కసరత్తును మొదలుపెట్టనున్నాడు.

వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నా ఈ చిత్రంతో మరో మారు యావత్ భారతీయ చిత్ర ప్రేక్షకుల ముందుకు మరో పాన్ ఇండియా చిత్రంతో రావాలని ఆయన కాంక్షిస్తున్నారు. 'హిరణ్య కశిప'లో ప్రధాన పాత్రను చేయనున్న ఆయన, ఆ పాత్ర కోసం మళ్లీ కండలు పెంచవలసి వుంది. త్వరలోనే అందుకు సంబంధించిన కసరత్తు మొదలుకానుందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తమ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దడానికి సురేశ్ బాబు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Hiranya Kashyap  mythological drama  Gunasekhar  Virata Parvam  Tollywood  

Other Articles