అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేసి ఏకంగా సినిమా ప్రిరిలీజ్ అంచనాలను దాటేస్తూ ఏకంగా రెండింతల లాభాన్ని అర్జించిన విషయం తెలిసిందే. రూపాయలు 85 కో్ట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఏకంగా 167 కోట్ల లాభాన్ని రూపాయలను అర్జించింది. హీరో బన్నీకి దర్శకుడు త్రివిక్రమ్ కు మిగిలిన చేధు జ్ఞాపకాలను ఈ సినిమా పూర్తిగా తుడిచి పెట్టేసి.. ఇద్దరికీ చిత్రసీమలో తిరుగులేదని నిరూపించింది.
తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం నుంచి ఒక తొలగించిన ఓ వీడియోను సామాజికి మాద్యమంలో విడుదల చేసింది. చిత్ర నిడివి ఎక్కువ కావడం వల్ల చిత్రంలో నుంచి ఈ సీన్ ను తొలగించింది చిత్రయూనిట్. దాదాపు రెండు నిమిషాల మేర నిడివి వున్న ఈ వీడియోలో అల్లు అర్జున్.. సుషాంత్ చేసే పనులను వీడియో తీసి.. స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుడున్న అతని వద్దకు వచ్చి ఈ వీడియోను చూపించి.. బ్లాక్ మెయిల్ చేసే సన్నివేశం.. అందులో భాగంగా సుషాంత్ బస్సు కోసం పరిగెట్టడం.. మురళీశర్మ అవేదన వ్యక్తం చేయడం ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా, సుషాంత్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫూజా హెగ్డే, విబిన్నమైన క్యారెక్టర్ లో మురళీ శర్మ నటించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, గీతాఅర్ట్స్ నిర్మాణబాధ్యతలు చేపట్టింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇవాళ మధ్యాహ్నం గీతా అర్ట్స్ ఈ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేయగా గంటల వ్యవధిలోనే 70 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. మరెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూడండీ..
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more