టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్నారు. ఈ మేరకు ఇప్పటికే చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైన నాటినుంచి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్ పాత్రలో ఎవరు మెరువునున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొనింది. గోవా బ్యూటీ ఇలియానా, శృతి హాసన్ సహా పలు పేర్లు వినిపించాయి. అయితే ఇంతకీ ఫైనలైజ్ అయ్యేదెవరని ఉత్కంఠ నెలకొనంగా చిట్టచివరకు అందాల రాక్షసి ఈ ఛాన్స్ ను కొట్టేసింది.
'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మగువా.. మగువా అనే చిత్రాన్ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి చక్కని సంగీతాన్ని సమకూర్చారు ఎస్ఎస్ తమన్. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో నివేద థామస్ .. అనన్య .. అంజలి సహా పలువురు కీలక పాత్రలల్లో నటిస్తున్నారు.
తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా ఇలియానాను .. శ్రుతి హాసన్ ను సంప్రదించారు. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియదుగానీ, లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో ఆదరణ పొందిన ఈ కథ, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more