టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు కొత్తగా ఎవరు ఊహించన విధంగా ఆయన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడి గా ఉన్న దాసరికి ఇంకో కొన్నినెలలో తన రాజ్యసభ సభ్యుడు పదవి కాలం ముగియనున్నది. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు దాసరి నారాయణ రావు సోనియా గాంధీకి లేఖలు రాసే పనిలో ఉన్నాడట. మొన్నటి వరకు దాసరి నారాయణ రావు నోరు మాట్లాడదేని.. ఇప్పుడు కొత్తగా తన లేఖలతో యుద్దం పుట్టిస్తాడట. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడు గా ఉన్న దాసరి నారాయణ రావు వల్ల పార్టీకి పెద్ద లాభం లేదు. పార్టీ పరంగా గానీ, ఒక నాయకుడి పరంగా గానీ ప్రజలకు ఏం మాత్రం ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
టాలీవుడ్ లో పెద్ద దిక్కుగా ఉన్న దాసరి ఎప్పుడు ఎవరో ఒకరి మీద నిప్పు కురిపిస్తు ఉంటాడు. ఇలా టాలీవుడ్ మీద కాకుండా ఏకంగా ఏఐసీసీ చైర్మన్ సోనియా గాంధీకి దాసరి లేఖల ప్రయాణం సాగిస్తున్నాడు. అసలు ఇన్ని సంవత్సరాల నుండి లేని కొత్త అలవాటును ఇప్పుడు దాసరి ఎందుకు ప్రయోగిస్తున్నాడు. అంటే దాని వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి చిరు రాకతో దాసరికి ప్రాధాన్యత తగ్గిందని, ఆయనను ఎవరు పట్టించుకోవటంలేదని, అందుకు నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని రుజువు చేసుకోవటం కోసం దాసరి ఈ పని చేస్తున్నడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతే కాకుండా .. దాసరి తన రాజ్య సభ సభ్యుడు పదవి కాలం దగ్గరపడటంతో.. మళ్లీ తన హవాను చాటుకునేందుకు దాసరి లేఖ ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తుంది.
అసలు ఆయన రాసిన లేఖ ఏముందంటే? ఎప్పుడు జరిగిపోయిన సద్ది న్యూస్ ను తిరిగి హాట్ హాట్ సోనియా గాంధీకి కొరియార్ లో పంపించాడని పార్టీ కార్యకర్తలు అంటున్నాడు. ఆయన రాసిన లేఖ లో ఉన్న విషయం ఇదేనట. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై చర్య తీసు కోవాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు ఈ లేఖలో సిఎంకిరణ్‌పై దాసరి ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్సార్ మరణానంతరం ముందుకు వచ్చి కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్న వైఎస్ జగన్‌ను, తెలంగాణ ఆందోళనలను కట్టడి చేయగలిగారని, అవసానదశకు చేరుకున్న పార్టీకి కిరణ్ జీవం పోశారని ఆయన పేర్కొన్నారు. కష్టాలకాసారం నుంచి పార్టీని గట్టెక్కించటానికి కిరణ్ పాటుపడుతుండగా, సాధారణ పరిస్థితి నెలకొంటున్న తరుణంలో ప్రభుత్వంలో కొందరు సీనియర్ నేతలు పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఆయనపై బురద చల్లుతున్నారని ఆయన ఆరో పించారు. ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయేందుకు కిరణ్ యత్నిస్తున్నప్పటికీ, ఆయన పట్ల ఈర్ష్య చెందిన కొన్నిశక్తులు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని నారాయణరావు విమర్శించారు. ఎట్టకేలకు కిరణ్, చిరంజీవి మద్య సఖ్యత నెలకొనటమనేది పార్టీ బలోపేతం అవుతుందనేందుకు శుభ సంకేతంగా ఆయన పేర్కొన్నారు.
అయితే దాసరి కాంగ్రెస్ నాయకులును దుష్ట శక్తులుగా భావించి రాయటం బాగాలేదని, అసలు దాసరి నారాయణరావే కాంగ్రెస్ పెద్ద దుష్ఠ శక్తి అని ఢిల్లీ నాయకులు అనుకుంటున్నారని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాగా, చాలా కాలంగా దాసరికి, చిరంజీవికి మధ్య సత్సంబంధాలు లేవు, ఎందకనో చిరుపై దాసరి అభిప్రాయం మారిపోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more