టాలీవుడ్ లో చిరంజీవి తరువాత నేనే అని చెప్పుకునే బాలయ్య కు కొత్త సమస్య వచ్చి పడింది. బాలకృష్ణ ‘సింహా’ విజయం కావటంతో.. ఆనందం ఎక్కువైన బాలకృష్ణ త్వరగా సెంచరీ చేయాలనే ఉద్దేశంతో .. వచ్చిన సినిమాను ఒప్పుకోవటం జరిగింది. అయితే .. సింహ ఎంత విజయం సాధించిందో.. వెంటనే దాసరి నారాయాణతో తీసిన పరమవీరచక్ర .. సినిమా బాలకృష్ణను .. పాతళంలోకి నెట్టిన విషయం తెలిసింది. అయితే తరువాత బాపు దర్శకత్వంలో .. విడుదలైన శ్రీరామరాజ్యం బాలకృష్ణకు కాస్త ఊపిరి పోసింది. ఆ ఊపిరితో.. బాలకృష్ణ మరొ అడుగు ముందుకు వేసి.. పరుచురి మురళి డైరెక్టర్ తో ‘అధినాయకుడు’ సినిమా చేయటం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ సినిమా కు కొత్త కష్టలు వచ్చియాని చెబుతున్నారు.
బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన 'అధినాయకుడు' సినిమా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పరుచూరి మురళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని శ్రీ కీర్తి కంబైన్స్ బేనర్‌పై ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మించారు. వాస్తవానికి ఏప్రిల్ 12న విడుదల కావాల్సిన ఆ సినిమా నిర్మాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ రోజు విడుదలకు నోచుకోలేక పోయింది.
తర్వాత ఏప్రిల్ 19న లేదా 20న విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. అయితే పాత సినిమాల తాలూకు అప్పులు మెడకు చుట్టుకోవడంతో కుమార్‌చౌదరి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ అప్పులు చెల్లిస్తేనే గానీ ఆ సినిమా విడుదల చేయడానికి వీల్లేదని సదరు వ్యక్తులు పట్టుబడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన పడిపోయారు.
చౌదరి బాకీలు చెల్లించాల్సిన వ్యక్తుల్లో దిల్ రాజు కూడా ఉన్నారు. 'డాన్' సినిమా డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ఆయనకు చౌదరి రూ. 2.25 కోట్లు బాకీ పడ్డారు. అలాగే ఆర్.ఆర్. మూవీమేకర్స్‌కు రూ. కోటి బాకీ పడ్డారు. ఆ సొమ్ము తాను చెల్లించలేననీ, నైజాం డిస్ట్రిబ్యూషన్ తీసుకొని, అందులో చెల్లించుకోమని ఆర్.ఆర్. మూవీమేకర్స్‌ను చౌదరి కోరుతున్నారు. ఇలాంటివే అనేక అప్పుల తాలూకు పంచాయితీలు దాసరి నారాయణరావు వద్దకు వచ్చాయి. వీటిలో కొంత శాతం అప్పులు ఇప్పుడు చెల్లించి, మిగతా వాటిని 'అధినాయకుడు' రిలీజయ్యాక వచ్చే ఓవర్‌ఫ్లోతో చెల్లిస్తానని చౌదరి చేస్తున్న వాగ్ధానాన్ని బాకీదారులు తోసిపుచ్చుతున్నారు.
ఎట్టకేలకు దాసరి సమక్షంలో వారి మధ్య ఓ అవగాహన కుదిరిందనీ, దాని మేరకు 'అధినాయకుడు'ను ఏప్రిల్ 20న కాకుండా, మే 4న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం 'అధినాయకుడు' సినిమా బాగా వచ్చిందని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 27న ఎన్టీఆర్ 'దమ్ము', మే 4న రవితేజ 'దరువు', మే 11న పవన్ కల్యాణ్ 'గబ్బర్‌సింగ్' రావడం ఖాయం కావడంతో 'అధినాయకుడు' ఫలితం ఎలా ఉంటుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి
అంతేకాకుండా.. అధినాయకుడు సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయటంతో.. డిస్టిబ్యూటర్స్ ముందుకు రావటంలో లేదని ఫిలింనగర్ టాక్.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more