మే నెల జగన్ తెచ్చిన కష్టాలు ఇలా ఉన్నాయి. ‘మే’ నెలలో ఎంపీ అయ్యి జగన్ కు కలసి వచ్చింది అనుకొంటే పొరపాటే.. ఎన్నిక అయ్యింది మొదలు ‘మే’ నెలలో జగన్ కు అన్నీ సమస్యలు ఎదురురే అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… కొన్ని సంఘటనలు కొంతమందికి ప్రత్యేకంగా ఉంటాయి.
* తొలిసారి జగన్ ఎంపీ అయింది ‘మే’ లోనే…
* తెలంగాణా మానుకోట సంఘటన ‘మే’ లోనే..
* 2011 ఉపఎన్నికలు’ మే’లోనే …
* 2012 ఉపఎన్నికల నోటిఫికేషన్ ‘ మే’లోనే ..
* సీబీఐ కోర్టు నుంచి సమన్లు వచ్చిందీ ‘మే’ లోనే ..
* సాక్షి మీడియా గ్రూపు బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేసిందీ ‘మే’ లోనే..
ఒక వ్యక్తి జీవితంలో ఏడాదిలో ఒకే నెలలో ముఖ్యమైన ఘట్టాలన్నీ జరగడం కాకతాళీయమే అయినా సంఘటనలను గమనించే వారికి మాత్రం అది ఆశ్చర్య కరంగా మిక్కిలి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి కోవకే చెందుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ కు సంబంధించినంతవరకూ రాజకీయ ముఖ్య ఘట్టాలన్నే ‘మే’ నెలలోనే జరగాయని విశేషంగా చెప్పవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికీ- మే నెలకీ అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి కడప నుంచి ఎంపీ గా పోటీ చేసి ఎన్నికయింది 2009 మేలో. ఆ తర్వాత ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్ హైకమాండుకు క్రమంగా జగన్ దూరంగా వచ్చారు. తండ్రి మరణం వల్ల చనిపోయిన వారిని పరామర్శించేందుకు ‘ ఓదార్పు యాత్ర ‘ పేరుతో జగన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా 2010మేలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ పర్యటనకు ఆయన ప్రణాళిక రూపుదిద్దుకొన్నారు. ఐతే.. ఆ సమయంలో తెలంగాణ వాదం బలంగా ఉండడం.. అంతకుముందే లోక్‌సభలో జగన్ సమైక్యాంధ్ర అనుకూల ప్లే కార్డులు పట్టుకున్నారని ప్రచారం జరగడంతో తెలంగాణ పొలిటికల్ జేఏసీ జగన్ యాత్రను అడ్డుకోవాలని పిలుపిచ్చింది. ఆ క్రమంలో మానుకోటలో చెలరేగిన అల్లర్లతో జగన్ టూర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో జగన్ సొంతపార్టీని పెట్టుకున్నారు. అదే క్రమంలో ఆయన లోక్‌సభ ఎంపీ పదవికి, తల్లి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీంతో 2011మేలో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవడంతో పాటు.. ఐదు లక్షల పైచిలుకు మెజార్టీతో జగన్ ఘన విజయం సాధించారు. ఇది కూడా మే నెలలోనే జరిగింది. సర్కారుపై తెలుగు దేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి 17మంది జగన్ అనుకూల ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురికావడంతో ‘ మే’ లోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇవి జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. అన్ని సీట్లలోను గెలిచి.. తన సత్తా ఏమిటో హస్తిన పెద్దలకు చాటి చెప్పాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు జగన్ కు ఈ మే నెల లోనే సమన్లు జారీ అయ్యాయి . మే నెల 28నాడు కోర్టుకు హాజరుకావాలని సమన్లు లో పేర్కొన్నారు. ఇదిలావుంటే సమన్లు జారీ అయిన వెను వెంటనే సాక్షి మీడియా గ్రూపు బ్యాంకు ఖాతాలను స్ధంభింప చేయడం కూడా మేలోనే జరిగాయి. ఇదంతా యాధృచ్చికమే ఐనా జగన్ కు మే నెల మండుటెండ సెగలా.. సెగలు.. తగులుతున్నాయి!… అన్నీ!.. షాకు మీద షాకులే!.. జగన్ భవిష్యత్ అందరికీ ఆశ్చర్య కరంగా వుంది.
ఇవన్నీ తట్టుకొనే.. సమస్యలకు ఎదురు నిలబడే సత్తా, ధైర్యం, మనోనిబ్బరం. లక్ష్యం.. విజయవంతంగా.. ముందుకు సాగే వ్యక్తిత్వం జగన్ కు వుందని వైయస్సార్ అభిమానులు అంటున్నారు..” దేవున్నాడు.. అంతా చూస్తున్నారు.. అన్నీ ఆ దేవుడే.. చూసుకుంటాడని!.. ..” ఆ నమ్మకమే జగన్ కు వరమా?.. ఈ ‘మే’ నెలే తెల్చేస్తుందా ?.. వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more