ఖుషిలో పవన్ కళ్యాణ్ కు మంచి లవర్ నటించి., ఆ తరువాత మహేష్ బాబు ప్రేమించే యువతిగా ఒక్కడు లో నటించి, జూనియర్ ఎన్టీఆర్ తో ఏమీ తెలియని అమాయకపు మరదలలా నటించిన అందాల భూమిక. భూమిక పెళ్లి చేసుకున్నతరువాత సినిమాల్లో పెద్ద నటించలేదు. యోగా మాష్టన్ పెళ్లి చేసుకోవటంతో.. ఆమె యోగా వైపు వెళ్లిందని టాలీవుడ్ లో అనుకున్నారు. భూమికను మళ్లీ సెకండ్ విన్నింగ్ లో తేవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అందుకోసం ఆమె ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
తెలుగు తెరపై అందాల మందారమై విరిసిన కథానాయిక భూమిక. 'ఖుషీ' ... ఒక్కడు' ... 'సింహాద్రి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమె ప్రేక్షకులకి ఎంతగానో చేరువైంది. అలాంటి భూమిక ఆమధ్య పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది. ప్రస్తుతం నిజజీవితంలో ఇల్లాలి పాత్రని పోషిస్తోన్న ఆమెని మళ్లీ తెరమీదకి తీసుకువచ్చేందుకు కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో అత్త కేరక్టర్ భూమిక చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారట.
ఈ విషయమై ఆమెని సంప్రదిస్తే, అప్పుడే అత్త పాత్రలేంటి ? అన్నట్టుగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందని చెబుతున్నారు. తాను అలాంటి పాత్రలు చేయదలుచుకోలేదనీ ... కుటుంబ నేపథ్యంలో సాగే ప్రధాన పాత్రలను మాత్రమే చేస్తానంటూ 'కలెక్టర్ గారి భార్య' చిత్రాన్ని ఉదాహరణగా కూడా చూపిందట. దాంతో ఆమె తన వయసుకి తగిన నాయిక పాత్రలకే ప్రాధాన్యమిస్తోందనే సంగతి తెలిసి వీళ్లు ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. భూమిక అత్త పాత్రని ఒప్పుకోకపోవడమే మంచిదైందనీ ... ఎందుకంటే అత్త కన్నా అందమైన కోడలు వాళ్లకి దొరకడం కష్టమయ్యేదని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more