గాంధీ భవన్ లో సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం కలిసి భోజనం చేస్తున్నారు. ఒక పక్క బొత్సతో కలిసి భోజనం చేస్తునే .. మరోపక్క .. బొత్స పై కిరణ్ పగ తీర్చుకుంటున్నడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పైకి మాత్రం భుజలమీద చేతులు వేస్తూ .. బొత్సను నెత్తిన చెయ్యి పెట్టాలనే ఆలోచనలో కిరణ్ ఉన్నాడని సీనియర్ కాంగ్రెష్ నాయకులు అంటున్నారు. మేక తోలు కొప్పుకొని పులివేషంలో ఉన్న కిరణ్ తన అసలు రూపం బయటపెడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మళ్లీ మద్యం కేసులో ఎలాగైన బొత్సను ఇరికించాలనే ఆలోచనలతో కొత్త ప్లాన్ వేసినట్లు కాంగ్రెస్ వారు అంటున్నారు.
రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులకు మందు నిలిపివేయమని సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. 926 షాపులకు సరఫరా నిలిపివేయటం జరిగిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇలా చేయటం వలన ఆ షాపుల యజమాని బయటకు వస్తాడనే ఫ్లాన్ సిఎందేనని ఆ అధికారులు అంటున్నారు. ఆ యజమాని వస్తేనే లైసెన్స్ ఇస్తామాని చెబుతున్నారు. బినామీ మద్యం దుకాణదారులపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝళిపించారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 226 మద్యం దుకాణాలకు సరుకు సరఫరాను నిలిపేశారు. లైసెన్స్‌డ్ యజమాని వస్తేనే సరుకు సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. ఈ దుకాణదారులు మద్యం సిండికేట్లపై ఏసీబీ జరుపుతున్న విచారణకు సహకరించడం లేదని గుర్తించిన నేపథ్యంలోనే ఈ దుకాణాలకు మద్యం షాపులకు మద్యం సరఫరాను నిలిపివేయాలని ఏపీ బేవరేజెస్ కార్పారేషన్ నిర్ణయించింది. దీంతో ఆరు జిల్లాల్లో 926పైగా మద్యం షాపులకు మద్యం సరఫరా నిలిచిపోయింది. కొందరు రాజకీయనాయకులు బినామీ పేర్లతో మద్యం షాపులను సొంతం చేసుకుని సిండికేట్లుగా మారి మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ విచారణలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారుల్లో అనేక మంది తెల్లరేషన్‌కార్డు హోల్డర్లు, మద్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉండడంతో ఏసీబీ విచారణ నేపధ్యంలో వారి జాడ తెలియకుండా పోయింది.
ఫలితంగా ఏసీబీ విచారణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. షాపు యజమానులను గుర్తించేందుకు మద్యం సరఫరా చేసే ప్రభుత్వరంగ సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏసీబీ లేఖ రాసింది. మద్యం లైసెన్సులు కలిగిన యజమానులు స్వయంగా వస్తేనే మద్యం సరఫరా చేయాలన్న ఏసీబీ సూచనకు లోబడి బేవరేజెస్ కార్పొరేషన్ అన్ని మద్యం డిపోలకు ఆమేరకు ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ అధికారులు నిర్దేశించినట్లుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్‌లతో పాటు మరికొన్ని జిల్లాల్లో 926 పైగా మద్యం షాపులకు మే నెలలో మద్యం సరఫరా నిలిపివేశారు. ఇదే విషయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారి నిర్థారించారు. శ్రీకాకుళం జిల్లాలో 232 మద్యం షాపులుండగా, వాటిల్లో 120కిపైగా, విజయనగరంలో 202 మద్యం షాపులుండగా వాటిలో 135 వరకు, విశాఖపట్నం జిల్లాలో 406 మద్యం షాపులుండగా వాటిల్లో 300 వరకు, గుంటూరు జిల్లాలో 342 షాపులు ఉండగా వాటిల్లో 225 వరకు, కరీంనగర్ జిల్లాలో 315 మద్యం షాపులు ఉండగా వాటిల్లో 40కిపైగా, ఖమ్మం జిల్లాలో 153 షాపులు ఉండగా వాటిలో 30 షాపుల వరకు, రంగాడ్డి జిల్లాలో 390 మద్యం షాపులు ఉండగా వాటిల్లో 40 షాపులు, హైదరాబాద్ జిల్లాలో 212 మద్యం షాపులు ఉండగా వాటిల్లో 20 షాపులకు మద్యం సరఫరా నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు. సరఫరా నిలిపివేసిన దుకాణాలకు సంబంధించిన అసలు యజమానులు స్టాకు కోసం వస్తే తమ ముందు హాజరుపర్చాలని ఏసీబీ అధికారులు ఆదేశించడం కొసమెరుపు.
అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ వ్యూహ, ప్రతివ్యూహాలను ఎదుర్కోడం గురించి, మరో పది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియగానే పార్టీ ఎంపీలందరినీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొనేలా రోడ్ మ్యాప్ ఇచ్చే విషయమై వీరు చర్చించారు. కాగా వీరిద్దరూ భోజన సమయంలో నిజంగా మనసువిప్పి మాట్లాడుకున్నారా, లేక పైపై మాటలకే పరిమితమయ్యారా ? అని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more