వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక ఉన్న కుట్ర బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే కొన్ని శక్తులు ఆయనను అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అంటున్నారు. వైఎస్ మరణం వెనుక పెద్దల హస్తం ఉందట. ఈ కుట్ర బయటకు రాకుండా ఉండేందుకే కొన్ని శక్తులు జగన్ సీఎం కాకుండా అడ్డుకుంటున్నాయాని ఆయన అంటున్నారు . వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎలాగైనా ఎన్నికలను వాయిదా వేయించాలనే దురుద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని జగన్ అనుచరులు అంటున్నారు .
మాచర్లలో మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్లు అక్షరసత్యాలు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేస్తున్న కుట్రలు స్పష్టంగా బయటపడుతున్నాయి . అందుకే జగన్ వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. జగన్‌ను అణగదొక్కేందుకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు ఒక వర్గం మీడియా శాయశక్తులా కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఎల్లో మీడియా జగన్‌ను అరెస్టు చేస్తారంటూ దుష్ర్పచారం చేసింది అని చెప్పారు. జగన్ వెంట రౌడీలు, గూండాలు ఉన్నారంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానిస్తున్నారని జగన్ అనుచరులు అంటున్నారు.
జగన్ అధికారంలోకి వస్తే.. ఆ కుట్ర వెనుక దాగి ఉన్న పెద్దలంతా బయటకు వస్తారన్న ఉద్దేశంతో అంతా కలిసి ఆయనను అణగదొక్కాలని చూస్తున్నారని వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్ద్దీ వైఎస్ జగన్‌పైన, ఆయన కుటుంబంపైన, పార్టీ నేతలు, కార్యకర్తలపైన వేధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఒక్క స్థానం దక్కదని సర్వేలు స్పష్టం చేయడంతో ఆ పార్టీల నేతలు నీచ రాజకీయాలకు దిగుతున్నారని పార్టీ కార్యాలయంలో జగన్ సన్నిహితులు విమరిస్తున్నారు.
జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు కౌరవ సైన్యంలా వంద మంది దాడి చేస్తున్నారని జగన్ ముఖ్య అనుచరులు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు కుమ్మక్కు కుట్రలకు మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ అయితే వయలార్ రవి ఎందుకు మకాం వేశారు? రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి దేశంలో మరెవరూ ఉండరని జగన్ పార్టీ నాయకులు మండిపడ్డారు. అధికారం కోసం వెన్నుపోటు రాజకీయాలకు శంకుస్థాపన చేసింది, హత్యా రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబేనని చెప్పారు. మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని తన స్వంత స్వార్థం కోసం ఉపయోగించుకొని అవసరం తీరాక హత్య చేయించింది చంద్రబాబేనని జగన్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు .
కాంగ్రెస్ బలపడేదిలేదు... దానికి భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు పార్టీ నాయకులు. పార్టీని వైఎస్ లీడ్ చేసినప్పుడు కాంగ్రెస్ ఒక ముత్యంలా ఉండేదని, ఎప్పుడైతే జగన్ బయటకొచ్చారో అప్పటి నుంచి ముత్యం లేని చిప్పలా మారిపోయిందని జగన్ ముఖ్య అనుచరులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more