ఎందుకంటే పెట్రోలు ధర ఒక్కసారే 8 రూపాయలకుపైగా పెరిగింది. రాష్ట్రంలో లీటరు పెట్రోలు 81 రూపాయలకు చేరింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పెట్రోల్ ధరను ఒకే దఫా ఇంత భారీఎత్తున పెంచడం ఇదే మొట్టమొదటిసారి. పెట్రోలు ధరలు ఏటికేటికీ అంతలా మండిపోవడానికి కారణం ఏంటి? వీటిని కిందికి తీసుకురావడం సాధ్యం కాదా? చాలా మందిలో ఈ ప్రశ్నలు వస్తుంటాయి. నిజానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించడం ఏమంత కష్టమేం కాదు. లీటర్ పెట్రోల్ ధరలో 42 శాతం పన్నులే. వీటిలో సగం తగ్గించినా పెట్రోల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
రూపాయి విలువ పడిపోయిందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని కాకమ్మ కబుర్లు చెబుతూ... కర్రు కాల్చి వాతపెట్టింది. యూపీఏ ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచడం దాదాపు ఇది 20వ సారి. గత రెండేళ్లలో పెట్రోలు ధర దాదాపు రెట్టింపైంది.ఆయిల్ కంపెనీలు విక్రయించే ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విధిస్తూ ఉంటాయి. ఈ వ్యాట్ రేటును బట్టే ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు ఆధారపడి ఉంటాయి. పన్ను రేటు ఎక్కువుంటే పెట్రోల్ ధర ఎక్కువగాను, తక్కువుంటే తక్కువగాను ఉంటుంది. మన దేశంలో వ్యాట్‌ను ఎక్కువగా వసూలు చేసే రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి.
పెట్రోలుపై దేశంలోనే అత్యధికంగా 33 శాతం వ్యాట్ వాత పెడుతున్న మన రాష్ట్రంలో ఇది రూ.8.30ల వరకు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు ధర రూ.81కు చేరింది. పెట్రో ధరలను కేంద్రం చివరి సారిగా గత ఏడాది నవంబర్ 4వ తేదీన పెంచింది. అదే ఏడాది మేలో లీటరుకు రూ.5 చొప్పున పెంచింది. పెంపు చరిత్రలో అప్పటిదాకా అదే రికార్డు! ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. పెట్రోలు ధరలు పెంచిన కేంద్రం... ప్రస్తుతానికి కిరోసిన్, డీజిల్, వంటగ్యాస్ జోలికి వెళ్లలేదు.
పెట్రోలు గరిష్ఠ చిల్లర ధరలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్సులు, రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ కలిపి దాదాపు 42 శాతంగా ఉంటుంది. అంటే పెట్రోలు లీటరు ధర రూ.100 ఉంటే దాంట్లో రూ.42 పన్ను భారమే. ఈ నిధులంతా రాష్ట్ర ఖజానాకు వెళ్లిపోతాయి. అందువల్లే ఎక్కువ పెంచాల్సి వచ్చిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొద్దిగా తగ్గించడానికి ముందుకొస్తాయి. పెట్రోల్ ఎంత అమ్ముడుపోతే రాష్ట్ర ఖజానాకు అంతగా నిధులు వస్తాయి. పెట్రో ధరలపై ప్రభుత్వం 2010 జూన్‌లో తన నియంత్రణ ఎత్తివేసింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ధరలు మార్చుకునేందుకు చమురు సంస్థలకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ... ప్రభుత్వ అనుమతి మేరకు చమురు సంస్థలు ధరలు పెంచుతున్నాయి. నియంత్రణ ఎత్తి వేసిన తర్వాత రెండేళ్లలో పెట్రోలు ధర 13 సార్లు పెరిగింది. రెండే రెండు సందర్భాల్లో మాత్రం స్వల్పంగా తగ్గింది.
ఇద్దరు తెలుగు వారు! ఒకరు... రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఇంకొకరు... పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి! వీరిద్దరూ కలిసి జనాన్ని బాదేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గింపు పేరిట దువ్వూరి సుబ్బారావు వరుసగా కీలక రేట్లను పెంచుతూ పోయారు. ఇతర దేశాలతో పోల్చితే ముడి చమురును ఇరాన్ తక్కువ ధరకే అందిస్తుంది. పైగా... భౌగోళికంగా మనకు దగ్గర కూడా! ఇరాన్ వద్ద ముడి చమురు కొంటే.. ధరతోపాటు రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ... మన వాళ్లు కొనరు! కారణం... అమెరికా ఒత్తిడి! అణు ఒప్పందంతో సహా అనేక అవసరాల నేపథ్యంలో ఇరాన్ నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలును ఆపేసింది. దీని ఫలితం... అంతిమంగా సామాన్యుడిపై పెను భారం!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more