కొత్త రాష్ట్రపతి ప్రణబ్ గురించి మనకు తెలిసిందే .. ఆర్థిక శాఖ మంత్రిగా మాత్రమే తెలుసు. ఆయన వ్యక్తిగత విషయాలు ఇప్పటివరకు ఎవ్వరికి తెలియావు. కానీ మన ప్రణబ్ కూడా ఆకతాయేనని తన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ర్టపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ బాల్యంలో బడికి వెళ్లేందుకు ఇష్టపడలేదని, కాని అర్చకునిగా ఉండేం దుకు ఇష్టపడేవాడని ఆయన పెద్ద సోదరి అన్నపూర్ణా బెనర్జీ వెల్లడించారు. ‘మా గ్రామం మిరటిలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లడాని కి అతను ఎప్పుడూ విముఖంగా ఉండేవాడు. అతనిని బడికి తీసుకువెళ్లడం కష్టంగా ఉండేది. అతనిని బాగా కొట్టేవారు. ఒకసారి మా అమ్మగారు అతనిని ఎంతగా కొట్టారంటే అతను స్పృ హ తప్పిపోయాడు.అయినా బడికి వెళ్లేవాడు కాదు. కారణం నాకు తెలి యదు’ అని 83 ఏళ్ల అన్నపూర్ణ పశ్చిమ బెంగాల్ బీర్భుమ్ జిల్లాలోని చిన్న పట్టణం కిర్నహార్‌లో తన ఇంటిలో కూర్చుని మీడియాతో చెప్పారు.
ప్రణబ్ పూర్వీకుల గ్రామం మిరటికి పొరుగునే ఉన్న కిర్నహార్ రాష్ర్ట రాజధాని కోలకతాకు దాదాపు 170 కిలో మీటర్ల దూరంలో ఉంది. ‘అసలు చదవాలనే ఉద్దేశం ఉందా అని అతనిని మా నాన్నగారు (కామదా కుమార్ ముఖర్జీ) అడిగారు.‘నన్ను కిర్నహార్ శివ్ చంద్ర బాలుర పాఠశాలలో చేర్పించండి’ అని ప్రణబ్ చెప్పాడు. అప్పుడు మా నాన్నగారు అక్క డ ప్రధానోపాధ్యాయునితో మాట్లాడి అతనిని చేర్పించారు’ అని అన్నపూ ర్ణ తెలియజేశారు. బాల్యం నుంచి కూడా ప్రణబ్‌కు ధార్మిక చింతన ఎక్కు వగా ఉండేదని, పూజలు చేయడంపై మక్కువ ఉండేదని ఆమె తెలిపారు. ‘నబన్న పూజ (శరదృతువులో కొత్త బియ్యపు అన్నం భుజించే పండుగ) సమయంలో అతను మా నాన్నగారు నిర్వహించే తంతును ఆసక్తితో గమనిస్తుండేవాడు. ఆ తరువాత ఇంటి దేవతకు తాజా పండ్లు, చెరకు రసం నైవేద్యంగా సమర్పిస్తుండేవాడు. ఆతరువాత అతను వెదురు కర్రలు, రాళ్లతో ఒక గది తయారు చేసి, అక్కడ దేవతా ప్రతిమను ఉంచి పూజ చేసేవాడు’ అని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ప్రణబ్ ఏటా దుర్గా పూజ రోజుల్లో మిరటికి వచ్చి నాలుగు రోజుల పాటు అర్చక పాత్ర పోషిస్తుంటారు. అయితే, తన తమ్ముడు రాజకీయ జీవితంలో ఎంత కఠిన వైఖరి అవలంబిస్తున్నా పిల్లలతో మాత్రం చాలా సరదాగా గడుపుతుంటా డని అన్నపూర్ణ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more